Mukesh Ambani వంటవాడి నెల జీతం ఎంతో తెలుసా..? దిమ్మతిరిగే సౌకర్యాలు కూడా..
Mukesh Ambani: ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్న ముఖేష్ అంబానీ లగ్జరీ జీవితం గురించి మనకు తెలుసు. ప్రపంచంలోనే అత్యం ఖరీదైన నివాసం యాంటీలియాలో వీరి కుటుంబం నివసిస్తోంది. అయితే ఆయన సిబ్బంది గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

అంబానీ సిబ్బంది..
బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన సిబ్బందిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. తన సిబ్బందికి మంచి జీతంతో పాటు ఎన్నో సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. 2017లో ముఖేష్ అంబానీ వ్యక్తిగత డ్రైవర్ జీతం నెలకు రూ.2 లక్షలుగా ఉందంటూ గతంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. అయితే తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీ వంట మనిషి ఎమ్మెల్యే జీతం కంటే ఎక్కువ పొందుతున్నారని వెల్లడైంది.

నెల జీతం ఎంతంటే..?
ముఖేష్ అంబానీ చెఫ్ జీతం నెలకు రూ.2 లక్షలని తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం ఢిల్లీలో ఎమ్మెల్యేల జీతం నెలకు రూ.90,000గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేల కంటే ముఖేష్ అంబానీ దగ్గర పనిచేసే వారి సంపాదన ఎక్కువని తేలింది. రిపోర్టు ప్రకారం అంబానీ దగ్గర పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది పిల్లలు విదేశాల్లో చదువుతున్నారని తెలుస్తోంది. వీరి చదువుకు సైతం అంబానీ సహాయం చేస్తారని సమాచారం.

ఆహారపు అలవాట్లు..
శాకాహారి అయిన ముఖేష్ అంబానీ సాధారణ ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారని నివేదిక వెల్లడించింది. సింపుల్ ఫుడ్ తినడం అంబానీకి చాలా కాలంగా అలవాటు. ముఖేష్ అంబానీ స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నప్పటి నుంచి సాధారణ ఆహారాన్ని ఇష్టపడతారు. యాంటిలియాలో పనిచేస్తున్న దాదాపు ప్రతి ఉద్యోగికి అంబానీ కుటుంబం మంచి జీతాన్ని అందిస్తోంది. జీతంతో పాటు, అంబానీ సిబ్బందికి ఇన్సూరెన్స్, విద్యాభత్యం వంటి అనేక రకాల సౌకర్యాలు కూడా లభిస్తాయి. అయితే ముఖేష్ అంబానీ వద్ద డ్రైవర్‌గా లేదా చెఫ్‌గా చేయడం అంత సులభం కాదని తెలుసుకోండి. దీనికోసం అనేక రకాల ప్రమాణాలను పాస్ కావాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications