నటుడితో నటి రమ్యాకు ?, భర్తకు మ్యాటర్ లీక్, ప్రియుడితో కలిసి మేడమ్ రోడ్లో ఏం చేసిందంటే ? !

చెన్నై/కోయంబత్తూరు/పొల్లాచ్చి: మంచి వయసులో ఉన్న యువతికి వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న తరువాత దంపతులు కాపురం పెట్టారు. భార్య చూడటానికి ఎర్రగా, నాజుకుగా చాలా అందంగా ఉంటుంది. దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య టీవీ సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. టీవీ సీరియల్స్ లో నటిస్తున్న మరో నటుడితో మేడమ్ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. దెబ్బకు నడిరోడ్డులో భర్తను కత్తులతో కసక్ కసక్ అని పొడిచేశారు.

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన పొల్లాచ్చిలోని నల్లిక్ కౌంటన్ పాళ్యం ప్రాంతంలో రమేష్ (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కోయంబత్తూరు సిటీలో నివాసం ఉంటున్న రమ్యా అలియాస్ కైదాన రమ్యా (31) అనే యువతిని రమేష్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత రమ్యా పొల్లాచ్చిలోని భర్త రమేష్ ఇంటిలో ఉంటోంది.

Chennai: A TV serial actress who tried to kill her husband with her boyfriend in Tamil Nadu.

ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న రమేష్ మద్యం సేవించడానికి అలవాటుపడ్డాడు. రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న రమేష్ అతని భార్య రమ్యాను చితకబాదేవాడు. రమ్యా చూడటానికి చాలా అందంగా ఉండటంతో ఆమె మీద భర్త రమేష్ కు అనుమానం ఎక్కువ అయ్యింది. రానురాను రమ్యా, రమేష్ దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రెండు సంవత్సరాల క్రితం భర్త రమేష్ ను వదిలేసిన రమ్యా కోయంబత్తూరులోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

పుట్టింటిలో నివాసం ఉంటున్న రమ్యా తరువాత చెన్నై చేరుకుని తమిళ టీవీ సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. పలు టీవీ సీరియల్స్ లో నటిస్తున్న రమ్యాకు తమిళ టీవీ సీరియల్స్ లో నటిస్తున్న డేనియల్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో పరిచయం కావడంతో అతనితో రమ్యా చాలా చనువుగా ఉండటం మొదలుపెట్టింది. కొంతకాలం క్రితం నటుడు డేనియల్, నటి రమ్యా శారీరకంగా దగ్గర అయ్యారని, అక్రమ సంబంధం పెట్టుకున్నారని తెలిసింది.

కొంతకాలం నుంచి అప్పుడప్పుడు పొల్లాచ్చిలోని భర్త రమేష్ ఇంటికి రమ్యా వెళ్లి వస్తోంది. నువ్వు టీవీ సీరియల్స్ లో నటించకూడదని, డేనియల్ తో మాట్లాడకూడదని భర్త రమేష్ అతని భార్య రమ్యా మీద ఒత్తిడి చెయ్యడం మొదలుపెట్టాడు. అయితే తాను టీవీ సీరియల్స్ లో నటిస్తానని, కొందరితో మాట్లాడవలసి వస్తుందని రమ్యా ఆమె భర్తకు తేల్చి చెప్పింది. ఇదే వియంలో మళ్లీ రమ్యా, రమేష్ మధ్య గొడవలు మొదలైనాయి.

నా భర్త రమేష్ ను చంపేస్తే మనం జీవితాంతం సుఖంగా ఉందామని నటి రమ్యా ఆమె ప్రియుడు డేనియల్ కు చెప్పింది. ఈనెల 19వ తేదీన రమేష్ బైక్ లో వెలుతుంటే రమ్యా, ఆమె ప్రియుడు డేనియల్ నడిరోడ్డు మీద అతన్ని అడ్డగించి కత్తులతో పొడిచారు. తీవ్రగాయాలైన డేనియల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతని భార్య రమ్యా, ఆమె ప్రియుడు డేనియల్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పొల్లాచ్చి పోలీసులు ఆదివారం రాత్రి నటి రమ్యా. ఆమె ప్రియుడు డేనియల్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+