youtuber: మదన్ భార్య కృతిక అరెస్టు, పబ్లిక్ గా అమ్మాయిలతో ? టెలిగ్రామ్ లో ఆ వీడియోలు సేల్ ?!
చెన్నై: అమ్మాయిలు, యువతులను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటు పరారైన పబ్జి మదన్ అలియాస్ మదన్ ఇంతవరకు పోలీసులకు చిక్కకపోవడంతో అతని కుటుంబ సభ్యులకు సినిమా కష్టాలు ఎదురైనాయి. మదన్ నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్ అడ్మిన్ అయిన అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. మదన్ తండ్రిని పోలీసులు విచారణ చేశారు. పబ్జి గేమ్ ను అడ్డుపెట్టుకుని మదన్ అమ్మాయిలను అసభ్యంగా పబ్లిక్ గా బూతులు తిట్టాడని, అమ్మాయిల అభ్యంతరకరమైన వీడియోలు, అశ్లీల వీడియోలు టెలిగ్రామ్ లో విక్రయిస్తున్నాడని తదితర ఆరోపణల మీద మదన్ మీద నాలుగు కేసులు నమోదు అయ్యాయి. యూట్యూబ్ తో ఫేమస్ అయ్యి 7 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ను సంపాధించుకున్న మదన్ ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగడంతో అతని భార్య జైలుపాలైయ్యింది.

ఫేమస్ యూట్యూబర్
తమిళనాడులో పబ్జి గేమ్ కు బానిసలు అయిన యువతి, యువకులకు మదన్ అనే పేరు కొత్తగా పరిచయం చెయ్యనవసరం లేదు. మదన్ కు యూట్యూబ్ లో 7 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మదన్ యూట్యూబ్ చానల్ పెట్టి భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నాడు. కొన్ని లక్షల మంది యువతి యువకులు మదన్ ను ప్రతిరోజూ ఫాలో అవుతున్నారు.

అమ్మాయిలే ఎక్కువ మంది
మదన్ కు కొన్ని లక్షల మంది అమ్మాయిలు అభిమానులుగా మారిపోయారు. పబ్జి గేమ్ అడ్డుపెట్టుకుని మదన్ అమ్మాయిలను అసభ్యంగా పబ్లిక్ గా బూతులు తిట్టాడని, అమ్మాయిలను అభ్యంతరకరమైన మాటలతో, అసభ్యంగా పబ్లిక్ గా బండబూతులు తిడుతున్నాడు. మదన్ నోటిదూలకే చాలా మంది అతనికి ఫిదా అయిపోయారు.

మదనుడి మీద నాలుగు కేసులు
అమ్మాయిలను అసభ్య పదజాలంతో దూషిస్తూ వారిని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఇటీవల కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పబ్జి గేమ్ ను అడ్డుపెట్టుకుని మదన్ అమ్మాయిలను అసభ్యంగా పబ్లిక్ గా బూతులు తిట్టాడని, అమ్మాయిల అభ్యంతరకరమైన వీడియోలు, అశ్లీల వీడియోలు టెలిగ్రామ్ లో విక్రయిస్తున్నాడని, అమ్మాయిలను వారి వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తదితర ఆరోపణల మీద మదన్ మీద కేసులు నమోదు కావడంతో మదన్ పరారైనాడు.

భార్య, తండ్రికి సినిమా కష్టాలు
మదన్ కోసం వెతుకుతున్న తమిళనాడు సీబీసీఐడి పోలీసులు అతని భార్య కృతిక, మదన్ తండ్రిని అదుపులోకి తీసుకుని సుమారు 12 గంటల పాటు విచారణ చేసి వివరాలు సేకరించారు. మదన్ నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్ కు అతని భార్య కృతిక అని గుర్తించిన సీబీసీఐడీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మదన్ యూట్యూబ్ చానల్ కు కృతిక ఈ మెయిల్ ఐడీ లింక్ చేశారని సీబీసీఐడీ పోలీసులు గుర్తించారు.

జైలుకు పంపించండి
మదన్ అతని యూట్యూబ్ చానల్ అడ్డం పెట్టుకుని అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, టెలిగ్రామ్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు విక్రయిస్తున్నాడని ఆరోపణలు రావడంతో సీబీసీఐడీ పోలీసులు సీరియస్ అయ్యారు. చెన్నైలోని ఎగ్మూర్ క్రిమినల్ కోర్టు ముందు మదన్ భార్య కృతికను హాజరుపరిచారు. జూన్ 30వ తేదీ వరకు కృతికను జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

అంతా పబ్లిక్ గానే చేసిన యూట్యూబర్
కృతికను జైలుకు పంపించిన సీబీసీఐడీ పోలీసులు ఆమెను కస్టడీకి తీసుకుని విచారణ చెయ్యాలని ఆలోచిస్తున్నారని తమిళ మీడియా అంటోంది. మొత్తం మీద పబ్జి గేమ్ అడ్డం పెట్టుకుని ఇంతకాలం అమ్మాయిలను బండబూతులు తిట్టిన మదన్ కు కష్టాలు ఎదరైనాయి. మరోపక్క మదన్ మీద కక్షతోనే పోలీసులు ఇలా కేసులు నమోదు చేశఆరని అతని మద్దతుదారులు కొందరు ఆరోపిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications