Chhattisgarh: క్యాండీ క్రష్ ఆడుతున్న సీఎం-బీజేపీ ఆరోపణలు-కంటిన్యూ చేస్తానంటూ కౌంటర్..
వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఒకటైన ఛత్తీస్ ఘడ్ లో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల వేళ ఈ మాటల యుద్ధం సహజమే అయినా ఇందులో సీఎం భూపేష్ బఘేల్ ను ఉద్దేశించి బీజేపీ చేసిన ఓ ఆరోపణ, దానికి ఆయన ఇచ్చిన కౌంటర్ మాత్రం చర్చనీయాంశమవుతున్నాయి. దీంతో ఛత్తీస్ ఘడ్ రాజకీయాలపై ఇతర రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది.
ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సెల్ ఫోన్లో క్యాండీ క్రష్ సాగా ఆడుతూ బీజేపీ నేతలకు దొరికారు. ఈ వీడియో బయటికి రాగానే బీజేపీ ఆయన్ను టార్గెట్ చేస్తూ పలు ఆరోపణలు గుప్పించింది. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ప్రజా సంక్షేమాన్ని వదిలిపెట్టి ఫోన్లో ఆటలు ఆడుకుంటారా అంటూ టార్గెట్ చేసింది. వీటిపై సీఎం స్పందిస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ సీఎం భూపేష్ బఘేల్ మాత్రం స్పందించారు.

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ సమావేశంలో తన మొబైల్ ఫోన్‌లో గేమ్ ఆడటంలో బిజీగా ఉన్నారని బీజేపీ ఇవాళ ఆరోపించింది. బీజేపీ ఐటీ సెల్ ఇన్ ఛార్జ్ అమిత్ మాలవీయ ఎక్స్ లో ఈ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఎంత ప్రయత్నించినా ప్రభుత్వం రాదని తెలిసి కూడా రిలాక్స్‌గా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికకు సంబంధించిన సమావేశం కంటే క్యాండీ క్రష్ ఆడటం ముఖ్యమని ఆయన భావిస్తున్నారంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
దీనిపై ఎక్స్ లో స్పందించిన భూపేష్ బఘేల్.. తాను రాష్ట్రంలోని సాంప్రదాయ క్రీడలతో పాటు క్యాండీ క్రష్ ఆడటం కొనసాగిస్తానని తెలిపారు. ఇది తనకు ఇష్టమైనదని, ఎవరు అధికారంలో ఉండాలనేది ఛత్తీస్‌గఢ్ ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. దీంతో బీజేపీ నేతలకు నోటి మాట లేకుండా పోయింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
-
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications