Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిగ్ బాస్ హౌస్ లోకి అధికార పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఎంట్రీ, అసలే నోరు, రచ్చ షురు !

బెంగళూరు: కన్నడ పాపులర్ షో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం అయ్యింది. కన్నడ బిగ్ బాస్ షో (Bigg Boss show) లో కర్ణాటక- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిక్కబళ్లాపురం (Chikkaballapur) కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ తొలిరోజు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. కలర్స్ కన్నడ ప్రోమోలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తున్నట్లు చూపించారు.

దీంతో బిగ్ బాస్ (Bigg Boss) అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. అన్ని రంగాల్లో పనిచేస్తున్న వారిని వంద రోజులు ఒకే ఇంట్లో ఉంచడం పెద్ద పని అనే విషయం తెలిసిందే. ఈ టాస్క్‌లో ఎవరు గెలుస్తారనే క్యూరియాసిటీని బిగ్ బాస్ హౌస్ (Bigg Boss)వంద రోజుల పాటు ఉంచుతుంది. ఆదివారం నుంచి ప్రారంభమైన కన్నడ బిగ్ బాస్ షోలో (Bengaluru) ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్లు ప్రవేశించారు.

bigg boss

వీరిలో చిక్కబళ్లాపురం కాంగ్రెస్ (Congress)పార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బిగ్ బాస్ హౌస్ లో ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం రాత్రి 9.30 గంటలకు కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బిగ్ బాస్ (Bigg Boss) హౌస్‌లోకి ప్రవేశించినట్లు షో చూపబడుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఎంతకాలం బిగ్ బాస్ హౌస్‌లో ఉంటారనే విషయంలో ఆసక్తినెలకొంది.

కొద్దిరోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెస్ట్ గా ఉండొచ్చని బిగ్ బాస్ షో (Bigg Boss)అభిమానులు అంటున్నారు. నేను నిన్ననే బిగ్ బాస్ హౌస్‌కి రావాల్సి ఉంది. అయితే ఈరోజు వచ్చాను. కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే (MLA) ఈశ్వర్ ప్రసాద్ చెప్పారు.

Chikkaballapur Congress MLA Pradeep Eshwar
లియో ట్రైలర్, సింహం థియేటర్ లోకి వచ్చింది, హీరో ఫ్యాన్స్ దెబ్బకు థియేటర్ సర్వనాశనం !

మేమంతా ఒంటరిగా బెంగుళూరుకు వచ్చాం, ప్రత్యర్థులు గెలవాలని కోరుకుంటున్నాను అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ పరోక్షంగా అన్నారు. ప్రదీప్ ఈశ్వర్‌తో సాటి బిగ్ బాస్ షో (Bigg Boss)కంటెస్టెంట్స్ మాట్లాడుతూ మేము ఓ ఎమ్మెల్యేలతో పోటీ చేస్తున్నాం, ఇదేం జోక్ చేసే విషయం కాదు. మేము ఎమ్మెల్యేతో పోటీ చెయ్యడం చాలా థ్రిల్ గా ఉందని బిగ్ బాస్ షో లో (Bigg Boss show) ఉన్నవాళ్లు అంటున్నారు. కన్నడ బిగ్ బాస్ షో బహుబాష నటుడు, దర్శకుడు, ప్రముఖ హీరో కిచ్చ సుదీప్ నిర్వహిస్తున్నాడు.

sudeep

తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ బాషలు అనర్గలంగా మాట్లాడే టాలెంట్ ఉన్న ప్రదీప్ ఈశ్వర్ సాదాసీదా వ్యక్తి మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి గెవలేదు. అప్పటి కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ రెడ్డి అలియాస్ డాక్టర్ సుధాకర్ మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చిక్కబళ్లాపురం (Chikkaballapur)నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రదీప్ ఈశ్వర్ అప్పటి మంత్రి డాక్టర్ సుధాకర్ మీద మొదటిసారే ఎమ్మెల్యేగా విజయం సాదించి వార్తల్లో నిలిచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+