Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లియో ట్రైలర్, సింహం థియేటర్ లోకి వచ్చింది, హీరో ఫ్యాన్స్ దెబ్బకు థియేటర్ సర్వనాశనం !

చెన్నై/హైదరాబాద్: దళపతి విజయ్ (Hero Vijay) అభిమానులు చాలా కాలంగా లియో ట్రైలర్ చూడాలని ఎదురుచూస్తున్నారు. చెన్నైలో గ్రాండ్‌గా ఈవెంట్‌ని నిర్వహించి లియో సినిమా ట్రైలర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే లియో ట్రైలర్ గ్రాండ్‌ ఈవెంట్‌కి పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో ఈవెంట్‌ క్యాన్సిల్‌ అయింది. ఈ నిర్ణయం దళపతి ( Vijay) అభిమానుల నిరుత్సాహానికి కారణమైంది.

ఓపెన్ ప్లేస్ లో లియో సినిమా ట్రైలర్ విడదల కావడంలేదని తెలుసుకున్న విజయ్ ఫ్యాన్స్ ఊగిపోయారు. లియో సినిమా ట్రైలర్ (Leo trailer) ఓపెన్ ప్లేస్ లో విడుదల చెయ్యకూడదని నిర్ణయం తీసుకున్నారు. 'లియో' చిత్ర నిర్మాతలు ఇప్పటికే విజయ్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పారు. ప్రోగ్రాం పాస్‌లకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా లియో ట్రైలర్ (Leo trailer)విడుదల కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు.

Hero Vijay fans destroyed the seats at the Rohini Theater in Chennai where the Leo trailer was released

అయితే దళపతి విజయ్ (Hero Vijay) అభిమానుల కోసం 'లియో' సినిమా ట్రైలర్ ను (Leo trailer) ప్రముఖ థియేటర్లలో ప్రదర్శించేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. అందుకు తగ్గట్టుగానే లియో ట్రైలర్ స్క్రీనింగ్ అక్టోబర్ 5వ తేదీన గురువారం విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు (hyderabad), మలయాళం, హిందీ, కన్నడ బాషల్లో విజయ్ (Hero Vijay) నటించిన లియో సినిమా ట్రైలర్ (Leo trailer)విడుదల చేశారు.

చెన్నైలోని (Chennai) రోహిణి థియేటర్ లో లియో సినిమా ట్రైలర్‌ను (Leo trailer) చూసేందుకు విజయ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. లియో ట్రైలర్‌ని చూసిన దళపతి విజయ్‌ (Hero Vijay) అభిమానులు కొందరు సందడి చేశారు. రోహిణి థియేటర్ వద్ద విజయ్ అభిమానులు పాటలకు తగ్గట్టుగా డ్యాన్స్ లు చేశారు. ఆ సందర్భంలోనే గురువారం సాయంత్రం 6. 30 గంటలకు లియో సినిమా ట్రైలర్ రోహిణి థియేటర్ వేశారు.

Hero Vijay fans destroyed the seats at the Rohini Theater in Chennai where the Leo trailer was released

ఫ్యాన్స్ డిమాండ్ ఎక్కువ కావడంతో అదే రోహిణి థియేటర్ లో మూడు నాలుగు సార్లు లియో ట్రైలర్ వేశారు. ఆ సందర్బంలో రెచ్చిపోయిన హీరో విజయ్ (Hero Vijay) ఫ్యాన్స్ రోహిణి థియేటర్ లో సీట్లు విరిచేసి నానా హంగామా చేశారు. రోహిణి థియేటర్ లోపల సర్వనాశనం కావడంతో థియేటర్ లో పని చేసే సిబ్బంది, యాజమాన్యం హడలిపోయింది. రోహిణి థియేటర్ లో సీట్లు మొత్తం విరిగిపోయి సర్వనాశనం అయిన తరువాత కొందరు వీడియోలు, ఫోటోలు తీపి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్‌గా మారాయి.

దళపతి విజయ్ (Hero Vijay) నటించిన లియో సినిమా ట్రైలర్‌తో అభిమానులు థ్రిల్‌గా ఫీల్ అయ్యారు. సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఒకడు "ఏం టర్నింగ్ పాయింట్.. మైండ్ బ్లోయింగ్" అంటున్నాడు. మరొకరు సూపర్ విజయ్, దళపతి + లోకేష్ + అనిరుధ్ కలిసి చేసిన లియో ట్రైలర్ (Leo trailer) చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయని పోస్టు చేశారు, ఎంత అద్భుతమైన ట్రైలర్ ఇది, మునుపెన్నడూ ఇలాంటి ట్రైలర్ చూడలేదని కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ లియో (Leo trailer) సినిమా ట్రైలర్ దళపతి విజయ్ (Hero Vijay) అభిమానులకు కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో దళపతి విజయ్, త్రిషా, యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ వంటి పెద్ద స్టార్ లు నటించడంతో సినిమా మీద అంచనాలు మించిపోయాయి. అలాగే గౌతం మీనన్, మన్సూర్ అలీఖాన్, ప్రియా ఆనంద్ తదితరులు లియో సినిమాలో నటించారు.

దళపతి ( Vijay) విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ కలిసి రెండోసారి సినిమా చేశారు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి మాస్టర్ సినిమా తీశారు. అలాగే లియో సినిమా ద్వారా త్రిషా, దళపతి విజయ్ 15 ఏళ్ల తర్వాత కలిసి నటించడం ఈ సినిమాపై ప్రత్యేకత క్రేజ్ ఏర్పడింది. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమాకే హైలైట్ (Leo trailer)అంటున్నది లియో చిత్ర యూనిట్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+