గొంతులు కోయండి, నేనే కాల్చేస్తా: తపస్ మరో వీడియో
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు తపస్ పాల్ మరింతగా చిక్కుల్లో పడ్డారు. తపస్ పాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన మరో వీడియో వెలుగు చూసింది. ఓ బెంగాలీ న్యూస్ చానెల్ ఆ వీడియో ప్రసారం చేసింది. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల గొంతులు కోయండని ఆయన తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
తానే స్వయంగా వారిని కాల్చి చంపుతానని హెచ్చరించారు. ఆ వీడియో ఫుటేజీ ఆ రోజుకు సంబంధించిందే. గత జూన్ మధ్యలో పశ్చిమ బెంగాల్‌లోని చౌమహా గ్రామంలో అత్యాచారానికి సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండో ఫుటేజీ మరో గ్రామం తెహెత్తోలో చేసిన ప్రసంగానికి సంబంధించింది.

"నేను మీ వెంట ఉన్నంతవరకు సిపిఎం కార్యకర్తలను ఎవరినీ వదిలిపెట్టకండి. మహిళలకు కూడా నేను చెప్పేదేమంటే కత్తుల గురించి మీకు తెలిసే ఉంటుంది. వాటితో వారి గొంతులు కొసేయండి" అన్నారు. ఓ సిపిఎం బచ్చాను చంపేయండని, మిమ్మల్ని ఎవరు పట్టుకుంటారో చూస్తానని కూడా ఆయన అన్నారు.
కేసు నమోదు చేసి తపస్ పాల్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్ పెద్ద యెత్తుున వస్తోంది. తపస్ పాల్‌పై తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్జీ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications