కాక్రోచ్ లకు బిగ్ షాక్..! 5 రోజుల జ్యూడియల్ కస్టడీకి కీలక నేతలు..!

జంతర్ మంతర్ వద్దకు అక్రమంగా ప్రవేశించినందుకు ముందుజాగ్రత్తగా అరెస్టు చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. వీరిద్దరితో పాటు అజింక్య షిండేపై కూడా బాండ్ ఉల్లంఘన, ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. ఇవాళ ఉదయం సుమారు 8 గంటలకు ఢిల్లీలోని మందిర్ మార్గ్‌లో ఈ ముగ్గురు నేతలను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ, పోలీసు బారికేడ్లను దాటి జంతర్ మంతర్‌లోకి ప్రవేశించిన షిండే, దాస్, రాంకాలను నిన్న ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులకు కాక్రోచ్ ల అనూహ్య ఝలక్..! దిప్కే స్ధానంలో కొత్త బాస్..!
పోలీసులకు కాక్రోచ్ ల అనూహ్య ఝలక్..! దిప్కే స్ధానంలో కొత్త బాస్..!

గతంలో సీజేపీ నేతల్ని అదుపులోకి తీసుకున్న సందర్భంగా. 50వేలు పూచీకత్తు సమర్పించి, ఏడాది పాటు ఎలాంటి శాంతిభంగ కేసులలో పాలుపంచుకోబోమని హామీ ఇవ్వడంతో విడుదలయ్యారు. ఈసారి అక్రమ ప్రవేశం, పూచీకత్తు షరతులను ఉల్లంఘించిన ఆరోపణలను వీరు ఎదుర్కొంటున్నారు. అలాగే వీరిని అలవాటైన నేరస్థులుగా పరిగణిస్తున్నారు.మరోవైపు ఈరోజు జంతర్ మంతర్ కేసులో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండేలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని, అక్రమ ప్రవేశం, పూచీకత్తు ఉల్లంఘన, ప్రభుత్వ అధికారి విధికి ఆటంకం కలిగించడం మొదలైన అభియోగాలు మోపారని సీజేపీ నేత, లీగల్ టీమ్ హెడ్ రత్నా సింగ్ తెలిపారు.

CJP Setback Delhi Court Sends Three Key Leaders to 5-Day Judicial Custody in Jantar Mantar Protest Case
రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్..! ఢిల్లీ నిరసనల వేళ మోడీ కేసులో..!
రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్..! ఢిల్లీ నిరసనల వేళ మోడీ కేసులో..!

నిన్న అదుపులోకి తీసుకున్న సీజేపీ నేతలు ముగ్గురినీ రాత్రి పొద్దుపోయే వరకు వారి లాయర్లను కలవడానికి అనుమతించలేదని, తెల్లవారుజామున 3గంటలకు ఒక ప్రైవేట్ వ్యాన్‌లో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారని రత్నా సింగ్ తెలిపారు. వారిని ఉదయం ఎస్సీఎం కోర్టులో హాజరుపరుస్తారని, తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీకి పంపే అవకాశం ఉందన్నారు. ఈ చట్టవిరుద్ధ చర్యలు జరిగినప్పటికీ, వారిలో ఆత్మస్థైర్యం ఏమాత్రం తగ్గలేదన్నారు. ఎస్ఐఆర్ అక్రమాలపై ఢిల్లీలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఈ అరెస్టులు, జ్యూడిషియల్ కస్టడీ జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+