Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CM PA:సీఎం పీఏ అత్మహత్యాయత్నం, కలకలం, సీఎం క్లారిటి, నాభర్తకు పొలిటికల్ టెన్షన్, భార్య, ఏం జరిగింది ? !

బెంగళూరు/ న్యూఢిల్లీ: దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప రాజకీయ కార్యదర్శి, సీఎంకు అత్యంత సన్నిహితుడు ఎన్ఆర్. సంతోష్ ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. ఉదయం సీఎం యడియూరప్పతో వాకింగ్ చేసి తరువాత ఆయనతో చాలా సమయం గడిపిన సంతోష్ ఇంటికి చేరుకుని మోతాదుకు మించిన స్థాయిలో నిద్రమాత్రలు మింగేశారు. విషయం తెలుసుకున్న సీఎం యడియూరప్ప అర్దరాత్రి ఆసుపత్రికి పరుగు తీసి వివరాలు సేకరించారు. సంతోష్ కు ఆత్మహత్యాయత్నంపై ఆయన భార్య క్లారిటీ ఇచ్చింది.

 సీఎం రాజకీయ కార్యదర్శి

సీఎం రాజకీయ కార్యదర్శి

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలోకి రావడానికి బీఎస్. యడియూరప్ప కీలకపాత్ర పోషించారు. బీఎస్. యడియూరప్ప రాజకీయ కార్యదర్శిగా ఎన్ఆర్. సంతోష్ పని చేస్తున్నారు. రాజకీయ కార్యదర్శిగానే కాకుండా సీఎం బీఎస్. యడియూరప్పకు సంతోష్ చాలా సన్నిహితుడు, నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 రాత్రి ఆత్మహత్యాయత్నం

రాత్రి ఆత్మహత్యాయత్నం

శుక్రవారం రాత్రి బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని సొంత ఇంటికి సంతోష్ వెళ్లాడు. తరువాత ఇంట్లో నిద్రమాత్రలు మింగేసిన సంతోష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. సంతోష్ భార్య జాహ్నవి వెళ్లి భర్తను పలకరించగా అతను అపస్మారకస్థితిలో పడి ఉన్న విషయం గుర్తించి వెంటనే ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్. రామయ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 అర్దరాత్రి సీఎం పరుగు

అర్దరాత్రి సీఎం పరుగు

తన రాజకీయ కార్యదర్శి సంతోష్ ఆత్మహత్యాయత్నం చేశాడని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు సమాచారం అందింది. వెంటనే అర్దరాత్రి సీఎం బీఎస్. యడియూరప్ప ఎంఎస్. రామయ్య ఆసుపత్రికి పరుగు తీశారు. సంతోష్ ఆరోగ్యం గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో బీఎస్. యడియూరప్ప సంతోష్ భార్య జాహ్నవితో పాటు అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

 సీఎం ఏం చెప్పారంటే ?

సీఎం ఏం చెప్పారంటే ?

శుక్రవారం ఉదయం తనతో పాటు తన పీఏ సంతోష్ సుమారు 45 నిమిషాల పాటు సంతోషంగా, ఉల్లాసంగా మాట్లాడుతూ వాకింగ్ చేశాడని సీఎం బీఎస్. యడియూరప్ప మీడియాకు చెప్పారు. వాకింగ్ చేసిన తరువాత కొన్ని రాజకీయ విషయాలపై తనతో చర్చించాడని, తరువాత ఎందుకు ఇలా ఆత్మహత్యాయత్నం చేశాడో అర్థం కావడం లేదని సీఎం బీఎస్. యడియూరప్ప విచారం వ్యక్తం చేశారు. సంతోష్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత తాను పూర్తి సమాచారం సేకరిస్తానని సీఎం బీఎస్. యడియూరప్ప మీడియాకు చెప్పారు.

Recommended Video

    Andhra Pradesh : Disha Mobile App Surpassed 11 Lakh Downloads
     నా భర్తకు పొలిటికల్ టెన్షన్

    నా భర్తకు పొలిటికల్ టెన్షన్

    రాష్ట్ర రాజకీయాల విషయంలో కొన్ని రోజుల నుంచి తన భర్త సంతోష్ చాలా టెన్షన్ పడుతున్నాడని అతని భార్య జాహ్నవి అన్నారు. ఉదయం బయటకు వెళ్లిన తన భర్త సంతోష్ రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి వచ్చి అతని గదిలోకి వెళ్లాడని. భోజనం చెయ్యాలని పిలవడానికి వెళ్లి చూడగా అప్పటికే అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని, మాకు కుటుంబ సమస్యలు ఏమీ లేవని సంతోష్ భార్య జాహ్నవి క్లారిటీ ఇచ్చింది. ఇటీవల కాలంలో కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప మీద ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నాయకులు విమర్శలు చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+