సీఎం అంటే ఇలా ఉండాలి, అంతర్జాతీయ విమనాశ్రయంలో టిఫిన్ రూ 5, భోజనం రూ 10, సూపర్

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా క్యాంటీన్‌ను మార్చి 11వ తేదీ అంటే నేటి నుంచి ప్రారంభించనున్నారు. దేవనహళ్లిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పీ-7 పార్కింగ్ ప్రాంతంలోని టెర్మినల్ 1 ముందు ఇందిరా క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా సోమవారం ఇందిరా క్యాంటిన్ ప్రారంభించనున్నారు.

ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖుషీగా మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు అందుబాటు ధరలో ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రజల కోసం అమలు చేసిన ప్రాజెక్టు ఇందిరా క్యాంటీన్ అని అన్నారు. ఈ ఇందిరా క్యాంటిన్ పథకం నేడు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేద ప్రజల ఆకలిని తీర్చే తన లక్ష్యాన్ని చాలా విజయవంతంగా నెరవేరుస్తోందని సీఎం సిద్దరామయ్య వివరించారు.

CM Siddaramaiah inaugurating Indira Canteen at Bengaluru International Airport

బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోని క్యాబ్ డ్రైవర్లు, కార్మికులు, పేద ప్రజల ప్రయోజనాల కోసం ఈ రోజు మేము విమానాశ్రయ ప్రాంగణంలో కొత్తగా ఇందిరా క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్నామని సీఎం సిద్దరామయ్య మీడియాకు చెప్పారు. ఈ ఇందిరా క్యాంటీన్ మరింత ఆకలితో ఉన్న పేద ప్రజల కడుపు నింపడానికి నాణ్యమైన ఆహారం అందించడానికి సిద్దం అయ్యిందని, పేదల కోసం ఇందిరా క్యాంటిన్ ఏర్పాటు చెయ్యాలనేది నా కోరిక అని సీఎం సిద్దరామయ్య వివరించారు.

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో (కెంపేగౌడ ఎయిర్‌పోర్టు) ఇందిరా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చాలాకాలం నుంచి క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డికి క్యాబ్ అండ్ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ సమర్పించిన 36 డిమాండ్లలో ఇదీ ఒకటి కావడం విశేషం. అందుకే ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందిరా క్యాంటిన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.

CM Siddaramaiah inaugurating Indira Canteen at Bengaluru International Airport

ఇప్పుడు సిద్దరామయ్య ప్రభుత్వం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందిరా క్యాంటీన్‌ను నేటి నుంచి ప్రారంభించనుంది. నివేదికల ప్రకారం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభం అవుతున్న ఈ కొత్త ఇందిరా క్యాంటీన్ లో ప్రతిరోజూ సుమారు 2, 000 మంది వినియోగదారులకు ఆహారం అందించడానికి సిద్దం అయ్యింది. క్యాబ్ డ్రైవర్లు, బీఎంటీసీ బస్సు డ్రైవర్లు, కండెక్టర్లకు ఇక్కడి ఇందిరా క్యాంటిన్ల వలన ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+