అమిత్ షా ఓ గూండా, రౌడీ, అయినా పక్కనే పెట్టుకున్న ప్రధాని మోదీ, సీఎం కొడుకు సంచలనం!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ గూండా, ఓ రౌడీ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తనయుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాలో సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ నాయకుల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చామరాజనగర్ జిల్లాలోని హనూర్ పట్టణంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో యతీంద్ర మాట్లాడుతూ అమిత్ షా ఓ గూండా, ఓ రౌడీ అని అన్నారు. గుజరాత్‌లో అమిత్ షా మారణహోమానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని ప్రధాని నరేంద్ర మోదీ తన పక్కనే పెట్టుకున్నారని, అమిత్ షాను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టారని సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర ధ్వజమెత్తారు.

CM Siddaramaiah s son Yatindra has accused Union Home Minister Amit Shah of being a bully and a goon

రెండు కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఉద్యోగం ఎక్కడ ఇచ్చారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం మా బాధ్యత కాదని బీజేపీ నాయకులు అంటున్నారని యతీంద్ర ఆరోపించారు. నల్లధనాన్ని వెనక్కి తెస్తామని గత లోక్ సభ ఎన్నికల సమయంలో చెప్పారని, అయితే నల్లదనం వెనక్కి తీసుకు వస్తామనే హామీని గాలికి వదిలేశారని యతీంద్ర ఆరోపించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కనీసం స్విస్ బ్యాంకులో ఖాతా ఉన్న వారి జాబితా కూడా విడుదల చేయలేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి పేదల కడుపు కొడుతున్నారని, మోదీ ప్రధాని కాక ముందు, ఇప్పుడు పెట్రోల్, డీజల్ ధరలు ఎంత తేడా ఉందో మీరే ఆలోచించండి అని యతీంద్ర ప్రజలకు సూచించారు.

లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏకి 400కు పైగా సీట్లు వస్తాయని చెబుతున్నారని, 400 సీట్లకు మించి ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలన్నది అమిత్ షా ఎజెండా అని యతీంద్ర ఆరోపించారు. దేశ చరిత్రలో మోదీ ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తోందని యతీంద్ర ఆరోపించారు. మోదీ మాయమాటలు నమ్మించి బీజేపీకి ఓటు వేస్తే దేశానికే చేటు అని మాజీ ఎమ్మెల్యే యతీంద్ర కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+