• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇండియన్ టెక్కీలకు షాకిచ్చిన కాగ్నిజెంట్, కారణమిదే!

By Narsimha
|

చెన్నై: అమెరికా బహుళ జాతీయ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఉద్యోగులకు షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న మార్పుల నేపథ్యంలో సాఫ్ట్ వేర్ రంగం మందగమనంలో సాగుతోంది.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికాలోని స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో హైర్ అమెరికన్, బై అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తీసుకొచ్చాడు ట్రంప్.

అయితే ఈ ఆర్డర్ కారణంగా అమెరికాలో ఇండియన్ సాఫ్ట్ వేర్ కంపెనీలు స్థానికంగా ఉంటున్న అమెరికన్లకే ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ప్రభావం భారత్ టెక్కీలపై తీవ్రంగా కన్పిస్తోంది.

ఈ పరిణామాలతో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఖర్చును తగ్గించుకొనే ప్రయత్నాలను ప్రారంభించాయి.దీంతో ఉద్యోగాలలో కోతలు విధిస్తున్నాయి. ఇందులో భాగంగానే అనేక కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు పింక్ స్లిప్ లను ఇస్తున్నాయి.

గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ఇండియన్లకు కాగ్నిజెంట్ షాక్

గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ఇండియన్లకు కాగ్నిజెంట్ షాక్

గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ఇండియన్లకు కాగ్నిజెంట్ షాకిచ్చింది. ఈబీ2, ఈబీ3 మార్గా్లో గ్రీన్ కార్డుల కోసం ధరఖాస్తులను నింపడం లేదని కాగ్నిజెంట్ స్పష్టం చేసింది. తర్వాత నోటీసు వచ్చేంతవరకు ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు కాగ్నిజెంట్ ప్రకటించింది.ఈ రెండు కేటగిరిల్లో ప్రస్తుత ధరఖాస్తుదారులకు మాత్రమే మద్దతిస్తామన్నారు. కొత్తవాటిని సస్పెండ్ చేస్తామని ప్రకటించింది.స్థానిక ఉద్యోగులను పెంచే ఉద్దేశ్యంతోనే కాగ్నిజెంట్ ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.దరిమిలా భారతీయులు గ్రీన్ కార్డు పొందడం కష్టమేనని అంటున్నారు నిపుణులు.

పరిస్థితులపై ఎప్పటికప్పుడు అంచనా

పరిస్థితులపై ఎప్పటికప్పుడు అంచనా

వ్యూహాత్మక వ్యాపార లక్ష్యాల్లో భాగంగా దీర్ఘకాలిక లక్ష్యాలతో భాగమ్యే అంతర్గత వ్యవహారాలను, ప్రయోజనాలకు ఎప్పటికప్పుడు అంచనావేస్తూ ఉంటున్నామని ఉద్యోగులకు పంపిన ఈ మెయిళ్ళలో కాగ్నిజెంట్ స్పష్టం చేసింది. దీనిలో భాగంగానే తదుపరి నోటీసు వచ్చేవరకు గ్రీన్ కార్డు ఈబీ2,ఈబీ3 అప్లికేషన్స్ ను నింపడంల లేదని ఆ కంపెనీ ప్రకటించింది.

శాశ్వత నివాసం కల్పించేందుకు స్పాన్సర్స్ గా ఉంటాం

శాశ్వత నివాసం కల్పించేందుకు స్పాన్సర్స్ గా ఉంటాం

అసోసియేట్లకు శాశ్వత నివాసం కల్పించేందుకు ఓ ముఖ్యమైన స్పాన్పర్ గా ఉంటామని కాగ్నిజెంట్ ప్రకటించింది. భవిష్యత్ లో కూడ ఇదే కొనాసగుతోందని ప్రకటించింది. అయితే కాగ్నిజెంట్ ఈబీ2, ఈబీ3, అప్లికేషన్స్ ప్రక్రియను నిలిపివేయడం శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న హెచ్ 1 బీ వీసా హెల్డర్స్ కు భారీ షాకే. అసాధారణమైన ప్రతిభ కనబర్చిన సీనియర్ మేనేజ్ మెంట్ లేదా ప్రోఫెషనల్స్ కు గ్రీన్ కార్డు కోసం ఈబీ1 రూట్ వాడుతారు.ఈబీ2,3 వీసాలను ప్రతిభావంతులైన వర్కర్లు, ప్రోఫెషనల్స్ కు మద్య దగువ స్థాయి ఉద్యోగులకు వాడుతారని డేవిస్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్ నర్ మార్క్ డేవిస్ తెలిపారు.

అమెరికా పరిణామాలు కూడ కారణం

అమెరికా పరిణామాలు కూడ కారణం

కాగ్నిజెంట్ హెచ్ 1 బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించనున్నట్టు ఇటీవలనే ప్రకటించింది. గత ఏడాది కంటే సగానికి తక్కువగా ఈ ఏడాది వీసాలను అప్లయ్ చేసింది. అమెరికా డెలీవరి సెంటర్లలో ఈ ఐటీ సంస్థ స్థానిక నియామకాలను పెంచింది.అంతేకాదు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు ఆ కంపెనీ రంగం సిద్దం చేసింది.ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు నోటీసులు కూడ జారీ చేసింది. అయితే కొందరు నేతలు ఈ విషయమై కార్మిక శాఖను కూడ ఆశ్రయించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cognizant said it will no longer be filing applications for green cards under the EB2 and EB3 routes+ until further notice. The US-headquartered IT firm will continue to support existing applicants in the two categories, but it will suspend fresh filings, signaling its intent to ramp up its onsite presence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more