Students: ఆంటీని బెదిరించి కాలేజ్ అబ్బాయిలు ఏం చేశారంటే ?, చెక్ పోస్ట్ లో ?

చెన్నై/పొల్లాచ్చి: బయట ఊరి నుంచి వచ్చిన యువకులు కాలేజ్ లో చదువుకుంటున్నారు. కాలేజ్ హాస్టల్ ఉండటానికి ఇష్టం లేని యువకులు కాలేజ్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు పంపిస్తున్న డబ్బులు కాలేజ్ అబ్బాయిల ఖర్చులకు సరిపోవడం లేదు. ఫ్రెండ్స్, లిక్కర్ పార్టీలు, గర్ల్ ఫ్రెండ్స్ ఇది స్టోరీ. జల్సాల కోసం కాలేజ్ యువకులు ఏం చేశారంటే ?

తమిళనాడులోని పొల్లాచ్చి సమీపంలోని కినతుక్కాడు లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన విద్యా అనే మహిళ ఇంటిలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడి కత్తితో బెదిరించి ఐదు తులాల బంగారు గొలుసులు లాక్కొని పరారైనాడు. ఈ ఘటనపై కినతుకడవు పోలీస్ స్టేషన్‌లో విధ్యా అనే మహిళ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

 College students looted gold jewelery after threatening to kill a woman in Pollachi in Tamil Nadu.

ఇన్‌స్పెక్టర్ సెంథిల్‌కుమార్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ కరుపుసామి ప్రత్యేక బృందంగా ఏర్పడి రహస్య వ్యక్తుల కోసం గాలించారు. బుధవారం సాయంత్రం కిణతుక్కాడు పాత చెక్‌పోస్టు ముందు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై అటుగా వేగంగా వచ్చిన ఇద్దరు యువకులను పోలీసులు అడ్డగించారు.

ఇద్దరు యువకులను పట్టుకున్న పోలీసులు వారిని విచారించగా పరస్పరంగా, వేర్వేరు విరుద్ధంగా సమాధానాలు చెప్పారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి బెండ్ తీసి విచారణ చేశారు. విచారణలో ఇద్దరు యువకులు పెరియనాథన్, లియోజి బిరియన్ తూత్తుకుడి జిల్లాకు చెందిన వారని తేలింది.

వీరిద్దరూ కోయంబత్తూరులోని ఓ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. కినతుక్కాడులోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో అద్దెకు నివాసం ఉంటున్న వారు ఇంట్లో ఒంటరిగా ఉన్న విధ్యా అనే మహిళను కత్తితో బెదిరించి బంగారు నగలు, నగదు దోచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి ఐదు తులాల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. కాలేజ్ అబ్బాయిలు మహిళను హత్య చేస్తామని బెదిరించి బంగారు నగలు, నగదు లూటీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+