మహిళా పిఏలంటేనే భయం: ఎంపి సెక్సియెస్ట్ వ్యాఖ్యలు

అసోం అత్యాచారం, తెహెల్కా లైంగిక వేధింపులను ఉదహరిస్తూ.. పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి ప్రత్యేక బిల్లుతో చాలామంది అధికారుల్లో భయం పట్టుకుందని, మహిళలను వ్యక్తిగత కార్యదర్శులుగా (పిఏ) నియమించుకోడానికి అధికారులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని అన్నారు.
వారిని నియమించుకుంటే కష్టాలు కొనితెచ్చుకున్నట్లేనని అభిప్రాయపడ్డారు. వరకట్న నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లే దీన్నీ చేసే అవకాశం లేకపోలేదని అన్నారు. తెహెల్కా ఘటన నేపథ్యంలో సంస్థలు మహిళలను చేర్చుకోవడానికి భయపడతాయన్నారు.
ఆయన వ్యాఖ్యల పైన జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మమతా శర్మ స్పందించారు. అనిల్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ఆయనకు నోటీసులు పంపిస్తామని చెప్పారు. నరేష్ తన వ్యాఖ్యల ద్వారా మహిళలు వేధింపులకు గురవుతున్నా ప్రశ్నించవద్దనేలా ఉన్నాయని కవితా కృష్ణన్ అనే అక్టివిస్ట్ అన్నారు.












Click it and Unblock the Notifications