సోనియాగాంధీ ఆస్తుల విలువ తెలుసా?
వరుసగా 25 సంవత్సరాలపాటు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఈసారి రాజ్యసభకు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలీ సీటును వదులుకొని రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళుతున్నారు. తన పోల్ అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను సమర్పించారు.
సోనియా గాంధీ మొత్తం ఆస్తుల విలువ 12,53,76,822 గా ఉంది. 2014లో వీటి విలువ రూ.9.28 కోట్లుగా ఉండేది. 2019లో ఆ మొత్తం రూ.11.82 కోట్లు అయింది. అంతేకాకుండా ఆమెవద్ద కోటిరూపాయల విలువైన ఆభరణాలున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చే రాయల్టీ, పెట్టుబడులు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్ల ద్వారా ఆస్తుల విలువ రూ.6.38 కోట్లుగా ఉంది. వీటిపై వస్తున్న వడ్డీతోపాటు ఎంపీ వేతనం తన ఆదాయ వనరని సోనియాగాంధీ వెల్లడించారు.

స్వదేశమైన ఇటలీలో తనకు వారసత్వంగా ఇల్లు వచ్చినట్లు తెలిపారు. 2014తో దాని విలువ రూ.19.9 లక్షలుగా ఉండేదని, ప్రస్తుతం అది రూ.26.83 లక్షలుగా ఉన్నట్లు తెలిపారు. వ్యక్తిగతంగా తనకు ఎటువంటి సామాజిక మాధ్యమ ఖాతాలు లేవని పేర్కొన్నారు. ఇంతవరకు ఎటువంటి క్రిమినల్ కేసులోను దోషిగా తేలలేదని చెప్పడంతోపాటు తన క్వాలిఫికేషన్ వివరాలను కూడా తెలిపారు. 1964లో విదేశీ భాషల్లో మూడు సంవత్సరాల కోర్సు పూర్తి చేశానని, 1965లో ఆంగ్లంలో సర్టిఫికేట్ కోర్సు చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియబోతోంది. వీటికి కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్ జారీచేయగా, ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది.
తొలిసారిగా సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నిక కానుండటంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఆ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్న సోనియా కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోకుండా ఉండేందుకు, తమ కుటుంబ సభ్యులకు కంచుకోటగా ఉండేందుకు ప్రియాంకను బరిలోకి దింపనున్నట్లు భావిస్తున్నారు.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు












Click it and Unblock the Notifications