సిద్దరామయ్య ఇంటి ముందు శ్రీరాముడు, హనుమంతుడు బ్యానర్లు, ఫ్లెక్సీలు ఔట్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ 135 అసెంబ్లీ నియోజక వర్గాల్లో విజయం సాధించింది. 135 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ సొంతంగా కర్ణాటకలో ఐదు సంవత్సరాలు రాజ్యం ఏలనుంది. ఇదే సమయంలో బెంగళూరులోని సిద్దరామయ్య ఇంటి ముందు శ్రీరాముడు, ఆంజనేయస్వామి పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగిస్తున్న వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.
కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో 100 శాంతం ఆ పార్టీ నాయకుడే సీఎం సీటులో కుర్చుంటారు. కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి రేసులో సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల పేర్లు ముందు వరుసలో ఉన్నారు. బెంగళూరులో మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్దరామయ్యకు ఇల్లు ఉంది.

ఇటీవల తాము అధికారంలోకి వస్తే కర్ణాటకలో బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. ఇదే సమయంలో సిద్దరామయ్య హిందూ ద్రోహి, హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ సిద్దరామయ్య ఇంటి ముందు శ్రీరాముడు, హనుమంతుడు (ఆంజనేయస్వామి) ఉన్న పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
తాను హిందూ ద్రోహి కాదని, తాను హిందువే అని, తాను హిందుత్వానికి, మతత్వ పార్టీలకు వ్యతిరేకం అని, తాను హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నించలేదని, మతత్వ పార్టీలను ఎదుర్కొంటున్నానని సిద్దరామయ్య ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది. ఇన్ని రోజులు బెంగళూరులోని సిద్దరామయ్య ఇంటి ముందు ఉన్న శ్రీరాముడు, హనుమంతుడి ఫ్లెక్సీలు, పోస్టర్లను ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొలగించారు.
#WATCH | Poster of Lord Ram and Bajrang Bali that was put outside Congress leader Siddaramaiah's residence in Bengaluru is now being removed. #KarnatakaElectionResults pic.twitter.com/vtotK0erSu
— ANI (@ANI) May 14, 2023
సిద్దరాయయ్య సీఎం అయితే ఆయన ఇంటి ముందు బీజేపీ నాయకులు నిత్యం పూజించే శ్రీరాముడు, హనుమంతుడి ఫ్లెక్సీలు ఉంటే ప్రజల్తో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని వాటిని ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొలగించారు. మాజీ సీఎం సిద్దరామయ్య ఇంటి ముందు ఉన్న శ్రీరాముడు, హనుమంతుడి ఫ్లెక్సీలు, పోస్టర్లను తొలగిస్తున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!











Click it and Unblock the Notifications