‘కలెక్టర్ గారూ హీరోయిన్‌లా ఉన్నారు’: బుక్కైన కాంగ్రెస్ ఎమ్మెల్యే

రాయ్‌పూర్: ఓ వ్యక్తి తాను ప్రజాప్రతినిధి అన్న సంగతి మర్చిపోయాడు. ఏకంగా ఓ జిల్లా కలెక్టర్‌ను పట్టుకుని మీరు హీరోయిన్‌లా ఉన్నారని, కానీ ఇంతకు ముందెప్పుడు తెరమీద నటిస్తుండగా చూడలేదని వ్యంగ్యంగా మాట్లాడాడు ఎమ్మెల్యే. దీంతో ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అమర్ జీత్ భగత్ మాట్లాడారు. కాగా, సర్‌గుజా జిల్లా కలెక్టర్ రితూ సేన్‌ను చూసి.. ఆమె చాలా అందంగా ఉందని, హీరోయిన్‌లా ఉందిగానీ ఆమె నటించడం తానెప్పుడూ చూడలేదని అన్నారు.

Congress MLA booked for calling collector ‘heroine’, referring to Kedar Kashyap as a 'mad minister'

అంతటితో ఆగకుంగా ప్రభుత్వంపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన 48ఏళ్ల జీవితంలో విద్యాశాఖ మంత్రి కేదార్ కశ్యప్ లాంటి పిచ్చివాడిని చూడలేదని అన్నారు. సీతాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన భగత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

దీంతో స్పందించిన బీజేపీ కార్యకర్తలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డుపై ట్రాఫిక్‌ను అడ్డగించడం, కలెక్టర్, మంత్రులపై తప్పుడు వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఓ ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+