చిన్న నోట్ల రద్దుపై కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ లేఖ..!

దేశవ్యాప్తంగా గతంలో పెద్ద నోట్ల ఆకస్మిక రద్దు ఎంత వివాదాస్పదమైంతో తెలిసిందే. దాని ప్రభావంతో చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయని ఇప్పటికీ విపక్షాలు ఆరోపిస్తూనే ఉంటాయి. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించడానికి యూపీఐ విధానాన్ని గట్టిగా అమలు చేసింది. దీంతో దేశంలో యూపీఐ లావాదేవీలు ప్రతీ ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిన్న నోట్లను రద్దు చేస్తూ కేంద్రం పరోక్ష నిర్ణయం తీసుకుందన్న చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో కీలకమైన చిన్న నోట్లు (రూ.10, రూ.20, రూ.50 నోట్లు)ను కేంద్రం అనధికారికంగా రద్దు చేసిందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఇప్పుడు గ్రామాల్లో ఈ చిన్న నోట్లు ఎక్కడా కనిపించకపోవడమే. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా ఇలా చిన్న నోట్లను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో లేకుండా చేయడంపై విపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం టాగూర్ ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు.

congress mp manickam tagore urge nirmala sitharaman to restore small notes in rural india

ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో చిన్న నోట్లు అందుబాటులో లేకుండా చేయడాన్ని మాణిక్కం టాగూర్ సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ఆర్థికమంత్రి నిర్మలను ఆయన కోరారు. ఆర్బీఐ చిన్న నోట్ల ముద్రణ నిలిపేసిందంటూ వస్తున్న వార్తలపైనా చర్యలు తీసుకుని తగు ఆదేశాలు ఇవ్వాలని ఆయన ఆర్థికమంత్రిని కోరారు. ఆర్బీఐ నిర్ణయాలతో అట్టడుగు వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని, కాబట్టి తక్షణం ఇందులో జోక్యం చేసుకోవాలని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+