పహల్గాం ఘటనపై కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ కీలక ఆదేశం..!

జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన తీవ్రవాద దాడి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో దీనిపై స్పందించే వారి సంఖ్య భారీగానే ఉంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా చర్చలు, కామెంట్లు పెట్టడం ఎక్కువవుతోంది. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అధికార బీజేపీకి వరంగా మారుతున్నాయి. దీనిపై ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా పాకిస్తాన్ తో యుద్దం అవసరం లేదని, మనం శాంతి కోరుకోవాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సిద్దరామయ్య వ్యాఖ్యలు పాకిస్తాన్ కు అనుకూలంగా ఉన్నాయంటూ బీజేపీ జాతీయ స్ధాయిలో ప్రచారం మొదలుపెట్టింది. ఇలాగే మరికొందరు పార్టీ నేతలు కూడా యథాలాపంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నష్టనివారణ చర్యలకు దిగింది.

congress orders leaders to toe party line on pahalgam attack related issues

26 మంది చావుకు కారణమైన పహల్గాం తీవ్రవాద దాడి, అనంతర పరిణామాలపై పార్టీ వైఖరికి భిన్నంగా ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దంటూ ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ తమ నేతలకు ఆదేశాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల క్రితం జరిగిన అఖిలపక్ష భేటీకి హాజరై కేంద్రం ఈ విషయంలో తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలతో అధిష్టానం ఇరుకునపడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ సైతం పార్టీ నేతలు తమ వ్యాఖ్యలతో గందరగోళం సృష్టించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ సైతం ఎక్స్ లో పోస్టు పెట్టారు. వ్యక్తిగత నాయకులు చేసిన ప్రకటనలు పార్టీ వైఖరిని ప్రతిబింబించవని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పష్టం చేశారు. ఖర్గే, రాహుల్ గాంధీ, అధీకృత ఏఐసీసీ ఆఫీస్-బేరర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే భారత జాతీయ కాంగ్రెస్ వైఖరిని సూచిస్తాయని ఆయన క్లారిటీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+