అర్దరాత్రి పార్టీ మారిపోయిన అనీల్, సిటీలో ఫుల్ టెన్షన్ టెన్షన్, మున్నభాయ్ కి హ్యాండ్ ఇచ్చి !

బెంగళూరు/బళ్లారి: మాజీ సీఎం, మాజీ ఉప ముఖ్యమంత్రితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోచాన్స్ చిక్కకపోవడంతో బీజేపీ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. బళ్లారి జిల్లాలో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ, లీడర్, శ్రీమంతుడు అనీల్ లాడ్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అర్దరాత్రి జేడీఎస్ పార్టీలో చేరడంతో బళ్లారి రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.

బళ్లారి సిటీ నుంచి పోటీ చెయ్యడానికి తనకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వాలని అనీల్ లాడ్ చాలా నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చుట్టూ తిరుగాడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన అనీల్ లాడ్ ప్రముఖ వ్యాపారవేత్త కూడా కావడంతో కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఇంతకాలం చాలా పట్టు ఉండేది.

Congress party leader Anil Lad who came out of Congress party

అయితే మధ్యలో ఏం జరిగిందో ఏమో ? కానీ బళ్లారి సిటీ నియోజక వర్గం ఎమ్మెల్యే టిక్కెట్ అనీల్ లాడ్ కు ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ నిరాకరించింది. తనకే సీటు ఇస్తామని ఇంతకాలం నమ్మించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చివరి నిమిషంలో తనను మోసం చేశారని అనీల్ లాడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తనను నిలువునా ముంచేసిందని అనీల్ లాడ్ బహిరంగంగా ఆరోపణలు చేశారు.

స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని అనీల్ లాడ్ ప్రకటించారు. గత వారంలో విడుదల చేసిన జేడీఎస్ జాబితాలో బళ్లారి సిటీ నియోజక వర్గం జేడీఎస్ టిక్కెట్ మున్నాభాయ్ కి ఇచ్చేశారు. అయితే బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ టిక్కెట్లు అందరికి ఇచ్చేయడంతో అనీల్ లాడ్ స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చెయ్యాలని అనీల్ లాడ్ డిసైడ్ అయ్యారు.

అయితే జేడీఎస్ పార్టీ బళ్లారి టిక్కెట్ విషయంలో మొత్తం తారుమారు అయ్యింది. అర్దరాత్రి బెంగళూరులోని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ఇంటికి వెళ్లిన అనీల్ లాడ్ మాజీ సీఎం కుమారస్వామి సమక్షంలో జేడీఎస్ పార్టీలో చేరిపోయారు. అనీల్ లాడ్ జేడీఎస్ లో చేరిపోవడంతో ఇప్పటికే టిక్కెట్ దక్కించుకున్న మున్నాభాయ్ కి ఆ పార్టీ నాయకులు షాక్ ఇచ్చారు.

మున్నాభాయ్ కి హ్యాండ్ ఇచ్చిన జేడీఎస్ పార్టీ దళపతులు ఆ పార్టీ బళ్లారి సిటీ అభ్యర్థిగా అనీల్ లాడ్ ను ప్రకటించారు. బళ్లారి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చెయ్యాలని అనుకున్న అనీల్ లాడ్ చివరికి అదే నియోజక వర్గం నుంచి జేడీఎస్ పార్టీ సింబల్ తో పోటీ చేస్తున్నారు. బుధవారం నామినేషన్ వెయ్యడానికి అనీల్ లాడ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బళ్లారిలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి పని చెయ్యాలని అనీల్ లాడ్ ఆయన మద్దతుదారులకు సూచించారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+