Congress: కాంగ్రెస్ ఖజానా ఖాళీ-క్రౌడ్ ఫండింగ్ కు పిలుపు-రూ.138 చొప్పున విరాళం..!
దేశంలో అతి పురాతన రాజకీయ పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిధుల కొరతతో అల్లాడుతోంది. ముఖ్యంగా వరుసగా పదేళ్ల పాటు అధికారంలో లేకపోవడం, వచ్చే ఎన్నికల్లోనూ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న గ్యారంటీ లేకపోవడంతో నిధుల రాక బాగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి నిధుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 18న పార్టీ 138వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిధుల సేకరణ చేపట్టబోతోంది.
డొనేట్ ఫర్ దేశ్ (దేశం కోసం విరాళం) పేరుతో ఆన్ లైన్లో ఓ క్రౌడ్ ఫండింగ్ (బహిరంగ నిధుల సేకరణ) చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ 138వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ రూ.138 చొప్పున విరాళాలను సేకరించబోతోంది.138వ వార్షికోత్సవం కాబట్టి 138 రూపాయల మల్టిపుల్స్ లో ఈ విరాళాలు అందించాలని కోరుతోంది. ఈ మేరకు ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్ ఓ ప్రకటన చేశారు.

1920-21లో మహాత్మాగాంధీ జాతీయోద్యమానికి ఇలాగే నిధుల సేకరణ కోసం చారిత్రాత్మకమైన 'తిలక్ స్వరాజ్ ఫండ్' కార్యక్రమం చేపట్టారు. దాని స్ఫూర్తితోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఆన్ లైన్ నిధుల సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సమాన వనరుల పంపిణీ మరియు అవకాశాలతో సమృద్ధిగా ఉన్న భారతదేశాన్ని సృష్టించడంలో తమ పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 138 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ ఖాతాలో రూ.138, రూ.1380, రూ.13800 చొప్పున విరాళాలు అందించాలని దేశ ప్రజల్ని అభ్యర్ధిస్తున్నట్లు అజయ్ మాకెన్ తెలిపారు. తద్వారా కాంగ్రెస్ మెరుగైన భారత దేశం కోసం పనిచేసేందుకు సాయం చేయాలని కోరారు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications