రాజస్తాన్ లో మహిళలకు ఏటా 10 వేలు-కాంగ్రెస్ మరో గ్యారంటీ..!
కర్నాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు సక్సెస్ కావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దానికి కాస్త అటు ఇటుగా ఆ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా హామీలు ఇస్తున్నాయి. ఈ హామీలు కూడా కొత్తగా కనిపిస్తుండటంతో త్వరలో ఎన్నికలు జరిగే తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో ఓటర్లు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఇదే క్రమంలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ మహిళలే టార్గెట్ గా రూ.10 వేల పథకాన్ని ప్రకటించింది.
రాజస్తాన్ లో మరోసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మహిళలకు ఏటా రూ.10 వేల రూపాయలను ఇస్తామని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. అలాగే ఈ పథకం విధివిధానాలను కూడా వెల్లడించారు. గృహలక్షి గ్యారంటీ పథకం కింద దీన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఏటా మహిళా కుటుంబ పెద్దకు విడతల వారీగా ఈ రూ.10 వేలు ఇస్తామని అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. దీంతో ఈ పథకం మహిళలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న దానిపై చర్చ మొదలైంది.

దీంతో పాటు మహిళలకు ఉపయోగపడే మరో పథకాన్ని కూడా అశోక్ గెహ్లాట్ ఇవాళ ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కోటికి పైగా కుటుంబాలకు వంట గ్యాస్ సిలెండర్ ను రూ.500 కే ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కర్నాటకతో పాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలెండర్ రేట్లను తగ్గిస్తామనే హామీ ఇస్తోంది. ఇదే కోవలో రాజస్తాన్ లోనూ ఈ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్రం ఉజ్వల గ్యాస్ కనెక్షన్లపై రూ.300 వరకూ తగ్గించింది.
రాజస్తాన్ లో ఈసారి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మరోసారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ధీమాగా కనిపిస్తుండగా.. తొలిసారి సీఎం అభ్యర్ధి ప్రకటన లేకుండా బరిలోకి దిగిన బీజేపీ మాత్రం మోడీ ఛరిష్మాను నమ్ముకుని పోరాడుతోంది.
-
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications