హిమాచల్ ప్రదేశ్ పోరు- బీజేపీకి సంకటంగా కాంగ్రెస్ సీపీఎస్ రద్దు హామీ-2.5 లక్షల ఓట్లు మరి..

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎల్లుండి జరిగే ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియబోతోంది. రాష్ట్రంలోని 68 అసెంబ్లీ సీట్లకు జరిగే ఈ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ మధ్య మరోసారి హోరాహోరీ పోరు నెలకొంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీనికి కారణం వివిధ వర్గాల్లో ఎదురవుతున్న వ్యతిరేకతే.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 12న ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలవడంద్వారా అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ సర్కార్ కు ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. వారికి గతంలో ఉన్న పాత పెన్షన్ స్కీమ్ స్ధానంలో సీపీఎస్ అమలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాలు పాత పెన్షన్ స్కీమ్ స్దానంలో సీపీఎస్ ను అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా పలు రాష్ట్రాలు సీపీఎస్ రద్దుకు మొగ్గుచూపుతుండటంతో బీజేపీ సర్కార్ పైనా వ్యతిరేకత పెరుగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ దాన్ని సొమ్ము చేసుకునేందుకు సిద్ధమైంది.

congresss employees cps cancellation promise trouble to bjp in Himachal Pradesh polls

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ జాతీయ స్ధాయి ప్రాధాన్యం ఉన్న ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాల్ని నమ్ముకుంటుంటే కాంగ్రెస్ మాత్రం ఉద్యోగుల సీపీఎస్ రద్దు వంటి హామీల్ని నమ్ముకుంటోంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల సీపీఎస్ ను రద్దు చేస్తామని ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ప్రభుత్వమే పెన్షన్ ఇచ్చేలా ఆదేశాల్ని సవరిస్తామంటోంది. దీంతో రాష్ట్రంలోని 2.5 లక్షల మంది ఉద్యోగులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో 1.5 లక్షల మంది ఉద్యోగులు సీపీఎస్ పరిధిలోకి వస్తున్నారు. దీంతో ఇప్పటికే వారు కొత్త పెన్షన్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ షిమ్లా, మండీ, కంగ్రా, సోలన్ లో ఆందోళనలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+