కర్నాటక సీఎం ఫైనల్ కాలేదు- అన్నీ ఫేక్ ప్రచారాలే అన్న కాంగ్రెస్ ఇన్ ఛార్జ్..

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తర్వాత సీఎం పదవిపై సస్పెన్స్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లలో ఎవరికి సీఎం పదవి లభిస్తుందన్న చర్చ నడుస్తున్న వేళ ఇవాళ హఠాత్తుగా ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. సిద్దరామయ్యను కాంగ్రెస్ పార్టీ కర్నాటక సీఎంగా ఎంపిక చేసిందన్న ప్రచారంతో బెంగళూరులో ఆయన నివాసం వద్ద సందడి నెలకొంది. అటు పీసీసీ ఛీఫ్ డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎంగా నియమించబోతున్నారని, రేపు వీరిద్దరి ప్రమాణస్వీకారం ఉంటుందని ప్రచారం సాగింది.

దీనిపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ కర్నాటక వ్యవహారాల ఇన్ ఛార్జ్ రణ్ దీప్ సూర్జేవాలా స్పందించారు. ఢిల్లీలో కర్నాటక సీఎం పదవి, కేబినెట్ ఏర్పాటుపై జరుగుతున్న చర్చల్లో పాల్గొంటున్న సూర్జేవాలా.. సీఎం పదవిపై వస్తున్న వార్తల్ని ఖండించారు. కర్నాటక సీఎం పదవిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటన చేస్తారని ఆయన వెల్లడించారు.

congress

కర్నాటక సీఎం పదవిపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే మీడియాకు వెల్లడిస్తామని సూర్జేవాలా తెలిపారు. వచ్చే 48 నుంచి 72 గంటల్లో కర్నాటకలో కేబినెట్ ఏర్పాటువుతుందని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ ఫేక్ అంటూ ఆయన కొట్టిపారేశారు. దీంతో రేపు కర్నాటక సీఎం ప్రమాణ స్వీకారం అంటూ జరుగుతున్న ప్రచారం అంతా ఒట్టిదేనని తేలిపోయింది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికార పంపిణీ ఇంకా ఫైనల్ కాలేదని అర్ధమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+