Haryana Polls: ఆ ఏడు హామీలపైనే కాంగ్రెస్ ఆశలు..!!
హర్యానాలో ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పోటా పోటీగా ఎన్నికల హామీలు గుప్పిస్తున్నాయి. గతంలో కర్ణాటక, తెలంగాణలో గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు హర్యానాలోనూ అదే ఫార్ములా అమలు చేస్తోంది. ఇక్కడ హామీ ఇచ్చిన ఏడు గ్యారంటీల పైనే కాంగ్రెస్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.
కాంగ్రెస్ తాజాగా హర్యానా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. ఇప్పటికే ఏడు హామీలను వెల్లడించిన కాంగ్రెస్ తాజాగా మేనిఫెస్టోలోనూ పలు హామీలను గుప్పించింది.ప్రతి కుటుంబానికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం, 18-60 ఏండ్ల మధ్య వయసు మహిళలకు నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్లు, పేద కుటుంబాలకు 200 గజాల స్థలంలో రెండు గదుల ఇల్లు, యువతకు 2 లక్షల శాశ్వత ఉద్యోగాలు, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, కులగణన, పాత పింఛన్ విధానం ప్రధానమైవి.

ప్రజలను ఆకర్షించి ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా హామీలు ఇచ్చే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చి విజయం సాధించింది. ఇప్పుడు హర్యానాలో మరో అడుగు ముందుకేసి ఏడు గ్యారెంటీలను ప్రకటించింది. తెలంగాణలోనూ కాంగ్రెస్ ఇదే ఫార్ములా అమలు చేసింది. అక్కడ హామీగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి దక్కటంతో ఇప్పుడు హర్యానాలోనూ అదే ఆశతో ఉంది. మరి.. ఇక్కడ ఎలాంటి ఫలితం వస్తుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications