‘మైనర్లతో అంగీకార శృంగారమైనా నేరమే’

ఛండీఘర్: మైనర్(పదహారేళ్లలోపు) బాలిక ఆంగీకారంతోనే ఆమెతో శృంగారంలో పాల్గొన్నామని చెప్పుకున్నా.. తర్వాత ఆమె కేసు పెడితే అది రేప్‌ కిందకు వస్తుందని పంజాబ్‌-హర్యానా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఒక అత్యాచారం కేసులో న్యాయమూర్తి జస్టిస్‌ అనితా చౌదరి ఇటీవల ఈ సంచలన తీర్పు వెలువరించారు.

మైనారిటీ తీరని ఒక బాలికను కిడ్నాప్‌ చేసి, అత్యాచారం చేసిన కేసులో గుర్గావ్‌ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దోషి చేసుకున్న అప్పీలును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కింది కోర్టు విధించిన పదేళ్ల జైలును అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది.

16 ఏళ్ల లోపు బాలిక సెక్సుకు అనుమతించిందని చెప్పి ఆమెను లోబరుచుకోవద్దని జడ్జి హెచ్చరించారు. బాధితురాలితో తనకున్న సంబంధాలు ఇష్టపూర్వకమైనవేననీ అంటూ నిందితుడు చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.

Consensual sex with girl below 16 is also rape: Punjab and Haryana high court

16 ఏళ్లలోపు యువతితో సెక్సులో పాల్గొన్న భాగస్వామి క్రిమినల్‌ అవుతాడని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో దోషి నేరానికి ముందే పెళ్లయి, ఇద్దరు పిల్లల తండ్రి. అతను 2010 జనవరి 22న బాధితురాలిని కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత ప్లేటు ఫిరాయించి తామిద్దరూ ఇష్టప్రకారమే సెక్సులో పాల్గొన్నట్లుగా జిల్లా కోర్టులో వాదించినా కింది కోర్టు విశ్వసించలేదు. అతగాడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, అదే శిక్షను దోషిగా తేలిన వ్యక్తి అనుభవించాల్సిందేనని తాజాగా హైకోర్టు స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+