చివరి నిమిషంలో.. కీలక మార్పు: కోరమాండల్ ప్రమాదానికి కారణాన్ని వెల్లడించిన రైల్వే మంత్రి

భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. 290కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. హౌరా- చెన్నై మార్గంలో పట్టాల పునరుద్ధరణ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వాటిని స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు.

ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని పోలీసులు, సహాయక సిబ్బంది బాలాసోర్ సహా వేర్వేరు ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. క్షతగాత్రుల పేర్లు, వివరాలను తెలియజేస్తూ రైల్వే అధికారులు ఓ జాబితాలను రూపొందించార. అలాగే- మృతదేహాలను గుర్తు పట్టడానికి వీలుగా వాటి ఫొటోలను తీసి.. వేర్వేరు వెబ్‌సైట్లల్లో పొందుపరిచారు. https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org వెబ్‌సైట్లల్లో ఈ జాబితా, మృతదేహాల ఫొటోలు అందుబాటులో ఉన్నాయి.

ashwinivaishnaw

ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో చోటు చేసుకున్న కీలక మార్పులేనని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శనివారం తెల్లవారు జాము నుంచీ ఆయన సంఘటన స్థలంలోనే ఉంటోన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తోన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఆయన మరోసారి తప్పుపట్టారు. యాంటీ-కొలిజన్ సిస్టమ్ కవచ్‌ను వినియోగించలేదనడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.

ప్రమాదానికి కవచ్ వ్యవస్థకు ఎలాంటి సంబంధం లేదని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిఇంటర్‌లాకింగ్, సిగ్నలింగ్ పాయింట్ వ్యవస్థలో చివరి నిమిషంలో చోటు చేసుకున్న మార్పులే కారణమని తేల్చి చెప్పారు. దీనిపై కారణాలను అన్వేషిస్తోన్నామని, సమగ్ర విచారణను జరిపిస్తోన్నామని వివరించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని, ఇదే విషయాన్ని ప్రధానమంత్రి కూడా ప్రకటించారని గుర్తు చేశారు.

ఈ దుర్ఘటన వెనుక మానవ ప్రమేయం ఉందా? లేదా? అనేది దర్యాప్తులో తేలుతుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సిగ్నలింగ్ పాయింట్‌, ఇంటర్‌లాకింగ్‌లో మార్పుల వల్లే ఈ ప్రమాదం.. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ సిస్టంలో మార్పులు చేశారని.. అదే ఈ ప్రమాదానికి దారి తీసిందని పేర్కొన్నారు. సిగ్నలింగ్‌ పాయింట్‌లో మార్పులు చేసిన వారిని గుర్తించామని, సిగ్నలింగ్‌లో జరిగిన ట్యాంపరింగ్‌పై నివేదిక సిద్ధమైందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+