Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

corona update : ప్రపంచంలో ఆరో స్థానం .. ఇటలీని దాటేసిన ఇండియా.. 10వేలకు చేరువగా కొత్త కేసులు

ఇండియాలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తుంది . కరోనా టెస్టులు ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో తక్కువగా జరుగుతున్నట్టు వైద్య నిపుణులు భావిస్తున్నారు. ర్యాపిడ్ టెస్టులు చేస్తే ఇండియాలో వాస్తవ కరోనా కేసులు విపరీతంగా ఉంటాయని ఒక అంచనా . ఇక కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇక నిన్నటి దాకా ప్రపంచంలోనే కరోనా కేసుల విషయంలో ఏడవ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఇటలీని దాటి ఆరో స్థానానికి చేరింది.

 ఇటలీని అధిగమించి ఆరో స్థానంలో ఇండియా

ఇటలీని అధిగమించి ఆరో స్థానంలో ఇండియా

భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య శుక్రవారం 2.35 లక్షలకు పెరిగిన తరువాత భారతదేశం ఇప్పుడు ఇటలీని అధిగమించి ఆరో స్థానంలో ఉంది. అమెరికా జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల లెక్కల ప్రకారం ఇప్పుడు భారత్ అత్యంత కరోనా ప్రభావిత దేశాల్లో ఆరో స్థానంలో నిలిచింది . గత ఏడాది చివర్లో కరోనా వైరస్ కు కేరాఫ్ అని భావిస్తున్న చైనాను భారత్ ఎప్పుడో దాటింది.

గత 24 గంటల్లో 9,887 కొత్త కేసులు నమోదు .. 294 మరణాలు

గత 24 గంటల్లో 9,887 కొత్త కేసులు నమోదు .. 294 మరణాలు

భారతదేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనావైరస్ కేసుల సంఖ్య 2,36,781 కు పెరిగిందని, మరణించిన వారి సంఖ్య 6,649 గా ఉందని తెలుస్తుంది. గత 24 గంటల్లో 9,887 కొత్త కేసులు నమోదు కాగా 294 మరణాలు సంభవించాయి. దీంతో భారత్ మరో రికార్డును నమోదు చేసింది. భారతదేశంలో ఇప్పుడు 1.15 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 20 రోజులుగా కరోనా కేసులు బాగా పెరిగాయి.

 యూఎస్ ప్రపంచంలో కరోనా కేసుల్లో ఫస్ట్ .. రెండో స్థానంలో బ్రెజిల్

యూఎస్ ప్రపంచంలో కరోనా కేసుల్లో ఫస్ట్ .. రెండో స్థానంలో బ్రెజిల్

జాన్స్ హాప్కిన్స్ డేటా ప్రకారం, ప్రపంచంలో 1.8 మిలియన్లకు పైగా కరోనా కేసులలో ఫస్ట్ ప్లేస్ లో యుఎస్ ఉంది. యుఎస్‌లో 18,80,703 కేసులు , 1,08,496 మరణాలు సంభవించాయి.. వీరిలో 485,002 మంది రికవర్ అయ్యారు. బ్రెజిల్‌లో కూడా, కరోనావైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. కరోనా బారిన పడిన దేశాల జాబితాలో ఇది అమెరికాతర్వాత రెండవ స్థానంలో ఉంది.బ్రెజిల్‌లో సోకిన వారి సంఖ్య ఐదు లక్షలను దాటింది. ఇప్పటివరకు 6, 14,941 మందికి వ్యాధి సోకింది . 34,021 మంది మరణించారు. అదే సమయంలో, 2,54,963 మంది చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు .

 మూడు నాలుగు స్థానాల్లో రష్యా , యూకే

మూడు నాలుగు స్థానాల్లో రష్యా , యూకే

కరోనావైరస్ ప్రభావిత దేశాల జాబితాలో రష్యా మూడవ స్థానంలో ఉంది. 8,726 కొత్త కరోనా కేసులతో , రష్యాలో సోకిన వారి సంఖ్య 449,834 కు చేరుకుంది. ఇక రష్యాలో మరణాల సంఖ్య 5,528 గా ఉంది . 212,237 మంది ఈ వ్యాధి నుండి బయటపడ్డారు. కరోనాతో యూకే లో 284,730 మంది కరోనా బాధితులుగా మారారు. మరియు ఇప్పటివరకు 40,344 మంది మరణించిన యూకేలో పరిస్థితి మరింత దిగజారింది.

Recommended Video

    Backend : India's Most Wanted,Test Positive For Coronavirus
    ఐదవ స్థానంలో స్పెయిన్ , ఆరో స్థానంలో ఇండియా

    ఐదవ స్థానంలో స్పెయిన్ , ఆరో స్థానంలో ఇండియా

    స్పెయిన్‌లో 240,978 మందికి కరోనా సోకగా , 27,134 మంది మరణించారు. ఐరోపాలో ఎక్కువగా ప్రభావితమైన దేశమైన ఇటలీలో కరోనా దెబ్బకు 33,774 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 2,34,531 మందికి కరోనా సోకింది. ఇక ఇటలీని తాజాగా ఇండియా అధిగమించింది . యూరోపియన్ దేశాలైన ఫ్రాన్స్ మరియు జర్మనీల పరిస్థితి కూడా భయంకరంగా ఉంది. ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు 189,569 మంది కరోనా బారిన పడ్డారు. జర్మనీలో 184,924 మందికి కరోనా సోకింది మరియు 8,645 మంది మరణించారు.ఇక చైనా ఇప్పటివరకు 87,174 మందికి కరోనావైరస్ వ్యాధి సోకింది మరియు చైనాలో 4,638 మంది మరణించారు. ఒక నివేదిక ప్రకారం, చైనాలో 80% మరణాలు 60 ఏళ్లు పైబడిన వారిలో నే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+