Coronavirus: నటి వనితకు వణుకు, బెయిల్ పై వచ్చిన ఆమె మాయం, కరోనా పాజిటివ్, శాపనార్తాలు !
చెన్నై/ మదురై: మూడో పెళ్లి చేసుకుని నిత్యం ఏదో ఒక విషయంలో వివాదాలు రేకెత్తించి వార్తల్లో ఉంటున్న బహుబాష నటి వనిత విజయ్ కుమార్ కు ఇప్పుడు వణుకు పుట్టింది. తన మూడో పెళ్లి విషయంలో విమర్శలు చేస్తోందని ఓ మహిళ మీద కేసు పెట్టిన నటి వనిత విజయ్ కుమార్ ఆమెను అరెస్టు చేయించింది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఆమె మాయం అయ్యింది. అయితే వనిత కారణంగా అరెస్టు అయిన మహిళకు కరోనా పాజిటివ్ అని తేలడంతో పోలీసులు బెంబేళెత్తుతున్నారు. మహిళ మీద కేసు పెట్టిన వనిత సహ ఆ రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమెను కలవడంతో ఇప్పుడు కరోనా వైరస్ భయంతో నటి వనిత వణికిపోతుంది.
Recommended Video

వనిత మూడో పెళ్లి వివాదం
నటి వనిత విజయ్ కుమార్ ఇటీవల మూడో పెళ్లి చేసుకుని వివాదాలకు కేంద్ర బింధువు అయ్యింది. నటి వనితపై అనేక మంది సెలబ్రిటీలు మండిపడ్డారు. సెలబ్రిటీల మీద నటి వనిత అదే స్థాయిలో విరుచుకుపడింది. ఇదే సమయంలో నటి వనిత విజయ్ కుమార్ ను టార్గెట్ చేసుకుని సూర్య దేవి అని మహిళ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.

నటి దెబ్బకు సూర్య దేవి అరెస్టు
సెలబ్రిటీల విషయంలో చూసిచూడనట్లు వ్యవహరించిన నటి వనిత సూర్య దేవి మీద కక్షకట్టింది. చివరికి నటి వనిత విజయ్ కుమార్ చెన్నైలోని వడపళని పోలీసులకు సూర్య దేవి మీద ఫిర్యాదు చేసింది. సూర్య దేవిని గత వారం వడపళని పోలీసులు అరెస్టు చేసే అంత వరకు నటి వనిత నిద్రపోలేదు. వనిత పోలీసులను సైతం నిద్రపోనివ్వలేదు.

కరోనా పాజిటివ్ తో మాయం
పోలీసులు సూర్య దేవిని అరెస్టు చేసిన సమయంలో ఆమెకు వైద్యపరీక్షలు చేయించారు. తరువాత సూర్య దేవిని కోర్టులో హాజరుపరచగా ఆమె బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. కోర్టులో బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన సూర్య దేవి మాయం అయ్యారు. ఇదే సమయంలో పోలీసులకు ఓ వార్త అందింది. సూర్య దేవికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆమె వైద్యపరీక్షలు చేసిన వైద్యులు తేల్చి చెప్పారు.

దేవుడా.... ఏం చెయ్యాలి ?
సూర్య దేవిని అరెస్టు చేసిన పోలీసులు, ఆమెను ఆసుపత్రికి వైద్యపరీక్షలకు పిలుచుకుని వెళ్లిన మహిళా పోలీసులు, ఆమెను పోలీస్ స్టేషన్ లో పెట్టిన తరువాత అక్కడ ఉన్న పోలీసులు ఇప్పుడు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. సూర్య దేవిని విచారణ చేసిన పోలీసు అధికారికి ఇప్పటికే కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది.

నటి ఏదో చెయ్యాలనుకుంది, ఇలా అయిపోయింది
సూర్య దేవిని అరెస్టు చేసిన తరువాత నటి వనిత విజయ్ కుమార్ వడపళని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. నటి వనిత పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో సూర్య దేవి అక్కడే ఉన్నారు. ఈ సందర్బంలో తనకుకూడా ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందో ? అనే భయంతో నటి వనిత విజయ్ కుమార్ వణికిపోతున్నారని తెలిసింది. బెయిల్ మీద బయటకు వచ్చిన సూర్య దేవి ఆచూకి కోసం పోలీసులు, వైద్య శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా ఇంత వరకు ఆమె ఆచూకి మాత్రం చిక్కడం లేదు. నీ మీద విమర్శలు చేసిన సెలబ్రిటీలను వదిలేసి పేద మహిళ అయిన సూర్య దేవిని అరెస్టు చేయించావని, నీకు దేవుడు తగిన శాస్తి చేస్తున్నాడని నెటిజన్లు నటి వనితకు శాపనార్తాలు పెడుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications