కరోనావైరస్: భారత్‌లోని 18 రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యూటెంట్ వేరియంట్’

దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో సేకరించిన కరోనా శాంపిళ్లలో ఒక కొత్త డబుల్ మ్యూటెంట్ వేరియంట్ కనుగొన్నట్లు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులకు, కొత్త వేరియంట్‌కు ఏదైనా సంబంధం ఉందా అనేది ఇప్పటివరకూ లభించిన డేటాలో స్పష్టంగా తెలీడం లేదని చెప్పింది.
కరోనా వైరస్‌లో ఈ కొత్త వేరియంట్‌ను విదేశాల్లో కూడా గుర్తించారు.గత కొంతకాలంగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి.కరోనా ఈ కొత్త రకానికి సంబంధఇంచిన తగినన్ని కేసులు లభించలేదని ఆరోగ్య శాఖ చెప్పింది.

వైరస్ కొత్త రకం
అయితే వైరస్ ఈ కొత్త రకం శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా తప్పించుకుని వ్యాప్తి పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు.
వైరస్ ఈ మ్యూటేషన్ దాదాపు 15 నుంచి 20 శాతం శాంపిళ్లలో గుర్తించారు. అయితే ఇది ఇంతకు ముందు రకాలతో సరిపోలడం లేదు.
2020 డిసెంబర్‌తో పోలిస్తే ఈ484క్యూ, ఎల్452ఆర్ మ్యూటేషన్ అంశాల్లో పెరుగుదల ఉన్నట్టు మహారాష్ట్ర నుంచి సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో గుర్తించారు. .
దేశంలోకి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులు, మిగతా రోగుల నుంచి లభించిన శాంపిళ్ల జీనోమ్ సీక్వెన్సింగ్, దాని విశ్లేషణ తర్వాత ఇలాంటి రకం వైరస్ వ్యాపించిన వారు దేశంలో 10 మంది ఉన్నట్లు గుర్తించారు.
ఇవి కూడా చదవండి:
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- నరేంద్ర మోదీ: ''తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
- కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా?వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన 'భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications