కరోనా కొత్త లక్షణాలు.. పాదం నుంచి మోకాలి వరకు నొప్పులు
మొన్నటివరకు అంతా ఫ్రీగా ఉన్నారు. నో మాస్క్.. బయట తిరిగారు. ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. కరోనా.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. గత ఏడాది వేసవిలో తీవ్ర ప్రభావం చూపగా.. ఈ సారి ముందే కేసులు ఎక్కువ అవుతున్నాయి. కేసులు సంగతి పక్కనబెడితే.. లక్షణాలు కూడా కొత్తగా చేరుతున్నాయి. అవును మెట్రో సిటీల్లో కరోనా సోకిన వారు తమకు ఇలా అనిపిస్తోందని కొత్తగా చెబుతున్నారు. దీంతో వాటిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. బెంగళూరులో కొందరు కొత్త సిప్టమ్స్ చెప్పారు.

కొత్త లక్షణాలు..
కరోనా, ఒమిక్రాన్ కేసుల్లో ఇప్పటి వరకు వినని కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. కాళ్లల్లో విపరీతమైన నొప్పికి తోడు, గొంతులో దురద ఉందంటూ బెంగళూరులో గల బాధితులు వైద్యులకు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్‌కు గురి అయిన రెండు రోజుల తర్వాత నుంచి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. బెంగళూరులో గల 24 గంటల్లో 9వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి. అవదులో 85 శాతం మంది హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ కోవిడ్ స్క్వాడ్‌కు తమ లక్షణాల గురించి తెలియజేస్తున్నారు.

నొప్పికి కారణం ఏంటీ..?
నొప్పికి కారణం ఏంటి అన్నది వైద్యులకు ఇంకా అంతుబట్టలేదు. స్వల్ప లక్షణాలు ఉన్న రోగులకే పాదాల నుంచి మోకాలి వరకు నొప్పి, గొంతులో దురద తదితర సమస్యలు కనిపిస్తున్నాయి. ఇదీ మాత్రం కాస్త ఊరట కలిగించే అంశం.
గత కొన్ని రోజులుగా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారు, విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన ఒక్క రోజులోనే కాలిలో విపతీరమైన నొప్పి అని చెబుతున్నారు. గొంతులో దురద ఒక్కరోజు ఉంటోంది. కాలిలో నొప్పి మూడో రోజు నుంచి తగ్గుముఖం పడుతోందని వాణి హాస్పిటల్ వైద్యులు తెలిపారు.

ఇవీ తీసుకొండి..
గొంతు దురద ఉన్నవారు బెటాడిన్ లోషన్‌తో గార్గిలింగ్ చేయాలని సూచించారు. కాలి నొప్పికి డోలో 650 మాత్ర వేసుకుంటే సరిపోతుందని వివరించారు. ఈ రెండింటితో తగ్గిపోతుందని తెలిపారు. కానీ చాలా మంది మాత్రం భయపడుతూనే ఉన్నారు.

వదల బొమ్మాళీ..
కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.












Click it and Unblock the Notifications