Coronavirus: ఇండిగో సంస్థ కీలక నిర్ణయం: చైనా రద్దీ రూట్లలో విమాన సర్వీసులు రద్దు..!
న్యూఢిల్లీ: చైనాను చుట్టుముట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావం.. విమాన సర్వీసులపైనా పడింది. భారత్ నుంచి చైనాలోని ప్రధాన నగరాల మధ్య రాకపోకలను సాగించే ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ విషయాన్ని ఇండిగో విమానయాన సంస్థ యాజమాన్యం వెల్లడించింది. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది.
న్యూఢిల్లీ నుంచి చెంగ్డు, బెంగళూరు నుంచి హాంగ్‌కాంగ్ మార్గంలో రాకపోకలను సాగించే తమ సంస్థకు చెందిన విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసినట్లు తెలియజేసింది. వచ్చేనెల 1వ తేదీ నుంచి దీన్ని వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. ఈ రెండు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉన్నప్పటికీ.. చైనాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ రెండు మార్గాల్లో విమాన సర్వీసులను ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయాన్ని ఆ సంస్థ వెల్లడించలేదు.

కాగా- కోల్‌కత నుంచి గ్వాంగ్ఝౌ మధ్య నడిచే విమాన సర్వీసులను ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగించనున్నట్లు పేర్కొంది. పరిస్థితులకు అనుగుణంగా కోల్‌కత-గ్వాంగ్ఝౌ మార్గంలో సర్వీసులను కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయాన్ని తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా- చైనాలో ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడం వల్ల ఇండిగో విమానయాన సంస్థ బాటలోనే మరిన్ని సంస్థలు కూడా ప్రయాణించే అవకాశాలు లేకపోలేదు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications