పదేళ్లకొచ్చినా లవర్స్‌ను వదల్లేదు: దాడి, కారు దగ్ధం

దంపతులు జహీద్ (27), నజ్మా (26) కారులో ఢిల్లీ నుంచి వచ్చారు. మహిళ సోదరుడు మరికొంత మందితో కలిసి వారిపై దాడి చేశాడు. వారి కారును తగులబెట్టాడు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ బిఎన్ ప్రషేర్ ఈ విషయం చెప్పారు.
దంపతులను కాపాడడానికి ప్రయత్నించిన మరో నలుగురు గాయపడినట్లు ఆయన తెలిపారు. గాయపడిన దంపతులను, ఇతరులను ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పారు. నిందితులు పరారీలో ఉన్నట్లు, వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ఆ దంపతులు పదేళ్ల క్రితం పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించకపోవడంతో వారు ఆ పనిచేశారు.












Click it and Unblock the Notifications