విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల ఘరానా మోసం, పాస్ పోర్టు, వీసా, ఎస్కేప్ !
బెంగళూరు: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ. 30 లక్షలు తీసుకుని దంపతులు మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లా ఆత్రాడి ప్రాంతంలో నివాసం ఉంటున్న జబేదా అనే మహిళ మంగళూరులోని బజ్పే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆసీఫ్ ఇస్మాయిల్, అతని భార్య హసీనా పర్వీన్, ఆమె తండ్రి ఇస్మాయిల్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆసీఫ్ ఇస్మాయిల్ సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. జుబేదా కుమారుడు ఫరాన్ సౌదీలో ఆసీఫ్ ఇస్మాయిల్ తో కలిసి 10 నెలల ఉద్యోగం చేశాడు. ఆ 10 నెలల జీతం ఇంకా ఫరాన్ కు ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. నీ కుమారుడు ఫరాన్ కు వీసా ఇప్పిస్తానని నమ్మించి జుబేదా దగ్గర రూ. 5 లక్షలు ఆసీఫ్ ఇస్మాయిల్ తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

జుబేదా కుమారుడు ఫరాన్ పాస్ పోర్టు సైతం ఆసీఫ్ ఇస్మాయిల్ దగ్గర ఉందని తెలిసింది. జుబేదా భర్త సౌదీలో 30 ఏళ్లు ఉద్యోగం చేశాడని, ఆ సర్వీస్ డబ్బులు ఇవ్వకుండా ఆసీఫ్ ఇస్మాయిల్, ఆయన భార్య హసీనా పర్వీన్ మోసం చేశారని జుబేదా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బజ్పేకి వచ్చిన ఆసీఫ్ ఇస్మాయిల్, హసీనా పర్వీన్ దంపతులను డబ్బు అడిగితే మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరించారని బాధితురాలు జుబేదా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆసీఫ్ ఇస్మాయిల్, ఆయన భార్య హసీనా పర్వీన్, ఆమె తండ్రి ఇస్మాయిల్ మళ్లీ విదేశాలకు వెళ్లిపోయారని, మాకు న్యాయం చెయ్యాలని జుబేదా ఫిర్యాదు చేసిందని పోలీసులు అన్నారు.
Recommended Video
ఉద్యోగం ముసుగులో ఆసీఫ్ ఇస్మాయిల్, హసీనా పర్వీన్ దంపతులు రూ. 30 లక్షల వరకూ తమకు మోసం చేశారని జుబేదా ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. విదేశాలకు వెళ్లిపోయిన ఆసీఫ్ ఇస్మాయిల్, హసీన్ పర్వీన్ దంపతులను సంప్రధిస్తున్నామని పోలీసులు చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications