షర్మిలను విడుదల చేయండి: మణిపూర్ కోర్టు ఆదేశం

Court orders release of Irom Sharmila Chanu, says 'she is not attempting to end life'
ఇంఫాల్: మణిపూర్ పౌర హక్కుల నేత ఇరోమ్ షర్మిల చానును విడుదల చేయాలని ఇక్కడి సెషన్స్‌కోర్టు ఆదేశించింది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఎత్తివేయాలంటూ 13 ఏళ్లగా ఆమె నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.

మణిపూర్ ఐరన్ లేడీగా పిలిచే ఈ 42 ఏళ్ల ఇరోమ్‌ షర్మిలపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి జుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. అప్పట్నుంచి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ముక్కుద్వారా ద్రవ పదార్థాలు అందజేస్తున్నారు

అయితే సెక్షన్ 309 కింద ఆమెపై మోపిన ఆత్మహత్యాయత్నం ఆరోపణలు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. జుడీషియల్ కస్టడీలో ఉన్న షర్మిలను తక్షణం విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వ తీరును కోర్టు తప్పుపట్టింది. 2000 నవంబర్‌లో అస్సాం రైఫిల్స్ దళాలు ఇంఫాల్ ఎయిర్‌పోర్టు వద్ద జరిపిన కాల్పుల్లో పది మంది పౌరులు మృతి చెందారు. దీనికి నిరసగా సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరించుకోవాలని పౌర హక్కుల నేత ఇరోమ్ షర్మిల నిరాహార దీక్ష ప్రారంభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+