భారత్‌, బ్రిటన్‌, బ్రెజిల్‌-మూడు వైరస్‌లపైనా ప్రభావవంతంగా కోవాగ్జిన్‌-ఐసీఎంఆర్‌ స్టడీ

భారత్‌లో నానాటికీ పెరిగిపోతున్న కేసుల దృష్ట్యా వ్యాక్సిన్ల డిమాండ్‌ కూడా అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో ఏది మంచిదనే చర్చ మొదలైంది. అయితే భారత్‌లో ప్రస్తుతం ఇస్తున్న వ్యాక్సిన్లన్నీ దాదాపుగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. అయితే ఇందులో కోవాగ్జిన్ మిగతా వాటి కంటే మిన్నగా భారత్‌, బ్రిటన్, బ్రెజిల్‌ వేరియంట్లపై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తాజాగా ఐసీఎంఆర్‌ నిర్వహించిన మరో అధ్యయనం తేల్చింది.

 కోవాగ్జిన్‌పై మరో అధ్యయనం

కోవాగ్జిన్‌పై మరో అధ్యయనం

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్‌ సంస్ధ రూపొందిందిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందన్న దానిపై ఐసీఎంఆర్‌ మరో అధ్యయనం నిర్వహించింది. పూణే లోని వైరాలజీ ల్యాబ్‌ సహకారంతో ఈ అధ్యయనం చేపట్టింది. ఇందులో భారత్‌తో పాటు బ్రిటన్, బ్రెజిల్‌కు చెందిన వైరస్‌ రకాలపై కోవాగ్జిన్ ఎలా పనిచేస్తుందన్న దానిపై అధ్యయనం చేసింది. బ్రెజిలియన్‌ వేరియంట్‌గా చెప్తున్న సార్స్‌-సీవోవీ 2 బీ1.128.2 రకంపై ఈ అధ్యయనం ప్రధానంగా సాగినట్లు తెలుస్తోంది. వీటి ఫలితాలను ఐసీఎంఆర్ తాజాగా ప్రకటించింది.

మూడు వైరస్‌లపై ప్రభావవంతంగా

మూడు వైరస్‌లపై ప్రభావవంతంగా

గతంలో బ్రిటన్, భారత్‌ రకాల వైరస్‌లపై కోవాగ్జిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని ఐసీఎంఆర్‌ తన అధ్యయనంలోతేల్చింది. ఇప్పుడు బ్రెజిల్‌ రకం వైరస్‌పైనా కోవాగ్జిన్ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఐసీఎంఆర్‌ తన తాజా అద్యయనంలో వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే భారత్‌, బ్రిటన్‌, బ్రెజిల్‌ రకాల వైరస్‌లపై కోవాగ్జిన్‌ సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు ఐసీఎంఆర్‌ చెబుతోంది. ఇలా విభిన్న రకాల వేరియంట్లపై కోవాగ్జిన్‌ పని చేయడం శుభపరిణామమని నిపుణులు చెప్తున్నారు.

Recommended Video

    Cricket Australia Donates USD 50,000 To India | Oneindia Telugu
    అమెరికాలోనూ కోవాగ్జిన్ ప్రభావం

    అమెరికాలోనూ కోవాగ్జిన్ ప్రభావం


    అమెరికాలో కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను ఆక్యుజెన్‌ అనే బయోఫార్మాసుటికల్‌ కంపెనీ తయారు చేస్తోంది. ఇప్పటివరకూ జరిగిన పలు అధ్యయనాల్లో కోవాగ్జిన్ అన్ని వేరియంట్లపైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలిందని, దీంతో అమెరికాలో సైతం కరోనాను ఎదుర్కోవడంలో కోవాగ్జిన్‌ కీలక పాత్ర పోషిస్తుందని సంస్ధ ప్రతినిధులు తెలిపారు. అమెరికాలో తాజాగా కోవాగ్జిన్‌పై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో సాధారణ పరిస్ధితుల్లో 78శాతం, తీవ్రమైన కేసుల్లో 100 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+