వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్-19 : టెస్టింగ్‌తోనే వ్యాధికి దూరం: అవగాహన కార్యక్రమం కోసం ఒక్కతాటిపైకొచ్చిన సెలబ్రిటీలు

|
Google Oneindia TeluguNews

దేశాన్ని కరోనావైరస్ కుదిపేస్తోంది. దీని బారిన పడిన ఎంతోమందికి సహాయం చేసేందుకు చాలామంది ముందుకొస్తున్నారు. ఇటు వ్యక్తులు అటు సంస్థలు తమకు తోచినంతగా విరాళాలు ప్రకటిస్తున్నాయి. ఇక స్టార్టప్ మరియు ఎంట్రప్య్రూనర్స్ సంయుక్తంగా కలిసి నాట్ ఫర్ ప్రాఫిట్ ఏసీటీ గ్రాంట్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి దీని ద్వారా "జాంచ్ బచాయే జాన్ " అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని పలువురు సెలిబ్రిటీల మద్దతుతో నిర్వహిస్తున్నారు. కోవిడ్ -19 టెస్టింగ్ గురించి ఈ సెలబ్రిటీలు అవగాహన కల్పిస్తారు. సెలబ్రిటీల్లో బాలీవుడ్ స్టార్లు హృతిక్ రోషన్, కునాల్ కపూర్, సైఫలీఖాన్‌లు ఉండగా మాజీ టీమిండియా క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కూడా ఉన్నారు. ఈ సెలబ్రిటీలంతా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తమ ఫాలోవర్స్‌కు అవగాహన కల్పించనున్నారు.

కోవిడ్-19తో ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో జాంచ్ బచాయే జాన్ కార్యక్రమం ద్వారా ఈ మహమ్మారిపై అవగాహన తీసుకురావడం జరుగుతుంది. అంతేకాదు పరీక్షల ముఖ్య ఉద్దేశాన్ని ఇందులో సెలబ్రిటీలు వివరించనున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఇప్పటికే చేస్తున్న కార్యక్రమాలకు తమవంతు కృషి కూడా జోడించడం అవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కోవిడ్ పరీక్షల గురించి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి వైరస్ వ్యాప్తి చెందకుండా నిలువరించడమే లక్ష్యంగా ఏసీటీ గ్రాంట్స్ పనిచేయనుంది.

కోవిడ్ -19 వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ డాక్టర్లను సంప్రదించి పరీక్షలు నిర్వహించేలా వారిలో అవగాహన తీసుకురావడమే తమ ముఖ్య ఉద్దేశమని ఏసీటీ గ్రాంట్స్ ప్రతినిధి సుదీప్తో సన్నీగ్రాహి తెలిపారు. ఈ విపత్కర సమయంలో సామాజిక బాధ్యతను మరువరాదని గుర్తు చేశారు. ఈ మహమ్మారిపై విజయం సాధించేందుకు వీలైనంత ఎక్కువమందిలో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఒక సమాజంలో జీవిస్తున్న వారిగా ఇది తమకొక సవాల్‌గా మారిందని అన్నారు మరో ప్రతినిధి ఆశిష్ అగర్వాల్. కోవిడ్-19 ప్రభావం తగ్గించాలంటే ప్రజల మద్దతు తప్పనిసరి అని ఆయన అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ కోవిడ్-19 పై అవగాహన కల్పించాలని, ఇతరులకు కూడా చెప్పాలన్నదే తమ ఉద్దేశమని అగర్వాల్ వెల్లడించారు.

సైఫ్ అలీ ఖాన్
ప్రస్తుతం మనం ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నామని ప్రముఖ బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్ చెప్పారు. ఒకరి పై ఒకరం ఈ కష్టసమయంలో ఆధారపడి ఉన్నామని చెప్పిన సైఫ్ అలీఖాన్... కోవిడ్-19కు సంబంధించిన పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఇది ఒక బాధ్యతగా భావించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఏసీటీ గ్రాంట్స్ ఇనిషియేటివ్ ద్వారా ప్రతి భారతీయుడు కోవిడ్-19 పరీక్షలపై అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. మనలను మనం రక్షించుకోవడం, మన కుటుంబాలను సురక్షితంగా ఉండాలంటే కోవిడ్-19 పరీక్షలు తప్పక చేయించుకోవాలని అన్నారు సైఫ్ అలీఖాన్.

Covid-19:Celebrities unite to share message that Testing Saves Lives

హృతిక్ రోషన్
ఒక యుద్ధంలో గెలవాలంటే ముందుగా శతృవు యొక్క బలబలాలు తెలిసి ఉండాలన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్. ఇక కరోనావైరస్ మహమ్మారిపై పోరాడి విజయం సాధించాలంటే ముందుగా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. భారతీయులుగా అది మన బాధ్యత అని గుర్తుచేశారు. ఈ ఉద్యమంలో మనవంతు కృషి చేసి కరోనావారియర్స్‌కు మద్దతుగా నిలుద్దామని తద్వారా కోవిడ్-19పై విజయం సాధిద్దామని హృతిక్ రోషన్ చెప్పారు.

Covid-19:Celebrities unite to share message that Testing Saves Lives

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియా వేదికలకు వ్యూయర్షిప్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువమందికి ఈ అవగాహన కార్యక్రమం చేరవేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్‌ను లైవ్‌లో నిర్వహిస్తామని ఏసీటీ గ్రాంట్స్ పేర్కొంది. సోషల్ మీడియాతో పాటుగా టీవీల ద్వారా కూడా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేసింది. యాక్షన్ కోవిడ్ -19 టీమ్ లేదా ఏసీటీ గ్రాంట్ అనే ఈ నాన్ ప్రాఫిట్ సంస్థను టాప్ వీసీ సంస్థలు అయిన సీకోయా ఇండియా, మాట్రిక్స్ పార్ట్‌నర్స్, సైఫ్ పార్ట్‌నర్స్, లైట్ స్పీడ్ వెంచర్స్, కలారి క్యాపిటల్, యాక్సెల్, చిరాటే వెంచర్స్, ఓమిడ్యార్ నెట్‌వర్క్, నెక్సస్ పార్ట్‌నర్స్‌తో పాటు పలు స్టార్టప్ కంపెనీలు కూడా భాగస్వామ్యం అయ్యాయి. స్టార్టప్ వ్యవస్థాపకుల్లో క్యూర్ డాట్ ఫిట్ సహవ్యవస్థాపకులు ముఖేష్ బన్సాల్, అర్బన్ కంపెనీ సహవ్యవస్థాపకులైన అభిరాజ్ భల్‌ లాంటి వారున్నారు. ఇక ఇందులో కొన్ని ఎన్జీఓలు కూడా భాగస్వాములయ్యారు.

ఇక ఏసీటీ గ్రాంట్స్ ద్వారా రూ.100 కోట్లు నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిధిని వీసీ మరియు స్టార్టప్ సంస్థలు కలిసి కోవిడ్-19 మహమ్మారి పోరుకు ఏర్పాటు చేశారు. కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా తమవంతుగా కృషి చేసే సంస్థలకు, కరోనావారియర్లకు ఈ నిధుల ద్వారా అండగా నిలుస్తారు. టెస్టింగ్ రేట్‌ను పెంచేందుకు, ఇంట్లోనే ఉండి వ్యాధిపై ఎలా పోరాడాలి, హెల్త్ కేర్ వర్కర్లకు హాస్పిటల్స్‌కు , ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికి వారి మానసిక ఆరోగ్యం కొరకు నిధులు వినియోగిస్తారు. మహమ్మారిపై పోరాడేందుకు స్టార్టప్‌లు ఎన్జీఓలు తమ వంతు కృషి చేయాలని ఏసీటీ గ్రాంట్ కోరుతోంది. ఈ వ్యాధిని గుర్తించడంలో టెక్నాలజీ పరంగా సహకారం అందించేందుకు స్టార్టప్ కంపెనీలు ముందుకు రావాలని కోరుతోంది.అంతేకాదు వ్యాధిని నియంత్రించేందుకు, నిర్మూలించేందుకు సహకరించాలని ఏసీటీ గ్రాంట్స్ కోరుతోంది.

ఏసీటీ గ్రాంట్స్‌కు సంబంధించి మరిన్ని వివరాలు సమాచారం కోసం ట్విటర్‌ను ఫాలో అవ్వండి: @actioncovidteam

English summary
ACT Grants, a not–for-profit coalition of start-ups & entrepreneurs, has unveiled an initiative called ‘Jaanch Bachaye Jaan’ with the support of popular celebrities such as Hrithik Roshan, Kunal Kapoor, Rahul Dravid and Saif Ali Khan to educate people about the importance of Covid-19 testing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X