Covid 19: భారత్ లో 1800 దాటేసిన కోవిడ్ కేసులు-కేరళలో మరణం-తాజా హెచ్చరికలు..!

భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదే క్రమంలో కేరళలో ఓ మరణం కూడా చోటు చేసుకుంది. దీంతో కేంద్రం అన్ని రాష్ట్రాల్నీ మరోసారి అప్రమత్తం చేస్తోంది. శీతాకాలం కావడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రాల్ని అప్రమత్తం చేస్తోంది.

భారత్ లో ఇవాళ్టికి యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 1828కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 ఇటీవల బయటపడిన కేరళలో ఓ మరణం నమోదైంది. కోవిడ్ సోకి కోలుకున్న వారి సంఖ్య 4.46 కోట్లకు పెరిగినట్లు కేంద్రం తెలిపింది. దీంతో జాతీయ స్ధాయిలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు, కోవిడ్ 19 కారణంగా భారత్ లో 5,33,317 మంది మరణించారు. అయితే మరణాల రేటు మాత్రం 1.19 శాతంగా ఉంది.

covid active cases crossed 1800 mark in india, one death in kerala

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు ఇచ్చారు. దేశంలో తాజాగా 335 కోవిడ్ -19 కేసులు నమోదైనట్లు ఆదివారం కేంద్రం తెలిపింది. యాక్టివ్ క్రియాశీల కేసుల సంఖ్య 1,701 కు పెరిగిందని కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటనలో తెలిపింది. అలాగే ఐదు మరణాలు నమోదయ్యాయిని, ఇందులో కేరళలో నలుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చెబుతోంది.

కేరళలో కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 విజృంభిస్తోంది. కేరళకు చెందిన 79 ఏళ్ల మహిళలో కోవిడ్ 19 ఉపరకం JN.1 కేసు బయటపడింది. ఐసీఎంఆర్ ఈ విషయాన్ని నిర్ధారించింది. డిసెంబర్ 8న తిరువనంతపురం జిల్లాలోని కరకుళంలో నిర్వహించి ఆర్టీ-పీసీఆర్ టెస్టులో ఈ కేసు నిర్ధారణ అయినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఈ మహిళకు ఇన్ఫ్లుఎంజా లైక్ ఇల్‌నెస్ తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిపాురు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+