క్రికెటర్ తనకు అబార్షన్ చేయించాడు, మేడమ్ కు ముందే పెళ్లి, విడాకులు అని రివర్స్ కేసు !

కర్ణాటక క్రికెటర్ కేసీ కార్యప్ప ప్రేమ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. క్రికెటర్, విడాకుల తీసుకున్న మహిళ పంచాయితీ పెద్దది అయ్యింది. తన మాజీ ప్రియురాలు తన ఇంట్లోకి చొరబడి అసభ్య పదజాలంతో దూషించి తన ప్రాణాలు తీస్తానని బెదిరించిందని క్రికెటర్ కేసీ కార్యప్ప బెంగళూరులోని బాగల్‌గుంటె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరోవైపు తనను పెళ్లి చేసుకుంటానని క్రికెటర్ కేసీ కార్యప్ప నమ్మించి తనకు అబార్షన్ చేయించాడని అతని మీద మాజీ ప్రియురాలు బెంగళూరులోని ఆర్ టి నగర్ పోలీస్ స్టేషన్‌లో రివర్స్ కేసు పెట్టింది. కర్ణాటకకు చెందిన ప్రముఖ క్రికెటర్ పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పరస్పరం ఒకరి మీద ఒకు ఇలా నిందలు వేసుకున్నారు.

cricketer KC Kariappas ex-girlfriend has filed a case against him for forcing her to have an abortion.

ఈ రెండు వేర్వేరు కేసులకు సంబంధించి విచారణ కొనసాగుతోందని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. నాకు క్రికెట్ కెరీర్ ఉందని, ఏడాదిన్నర క్రితం నేను ఒక మహిళను కలుసుకున్నానని, తరువాత ఇద్దరూ స్నేహం చేసి తరువాత ప్రేమలో పడ్డామని, ఆమె క్యారెక్టర్‌ సరిగా లేదని, ఆమె డ్రగ్స్‌, మద్యానికి బానిసైందని, చాలాసార్లు బుద్ది చెప్పినా ఆమె వినకపోవడంతో మా ప్రేమకు బ్రేక్‌పడిందని క్రికెటర్ కేసీ కార్యరప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో కోపోద్రికురాలైన ఆమె నాపై తప్పుడు కేసులు బనాయించిందని, గతేడాది బెంగళూరులోని బాగల్‌గుంటె పోలీస్ స్టేషన్‌లో తన మీద ఫిర్యాదు చేసిందని, ఈ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టుకు బి రిపోర్టు సమర్పించారని, అయినా ఆమె నన్ను పదే పదే వేధిస్తోంది. నీ క్రికెట్ కెరీర్ నాశనం చేస్తానని బెదిరిస్తోందని, నా క్రికెట్ కెరీర్ నాశనం అవుతుందనే ఇంతకాలం ఆమె వేధింపులను చాలా ఓపికగా భరించానని క్రికెటర్ కేసీ కార్యప్ప అతని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

డిసెంబరు 22వ తేదీన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బెంగళూరులోని రామయ్య లేఅవుట్‌లోని మా ఇంట్లోకి చొరబడి ఆమె మా అమ్మ ప్రతిమా, తండ్రి చామన్నలను చెప్పరాని మాటలతో దుర్భాషలాడిందని, మీ అందరి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని, ఆన్‌లైన్‌లో కత్తిని ఆర్డర్ చేసి ఆ కత్తి మా ఇంటికి తీసుకు వచ్చిన తన తల్లిదండ్రులను బెదిరించిందని కేసీ కార్యప్ప అతని మాజీ ప్రియురాలి మీద పోలీసులకు చేసిన ఫిర్యాదులో వివరించాడు.

cricketer KC Kariappas ex-girlfriend has filed a case against him for forcing her to have an abortion.

అయితే కేసీ కార్యప్ప మాజీ ప్రియురాలు పోలీసులకు ఇలా ఫిర్యాదు చేసింది. నేను 2018 లో పెళ్లి చేసుకున్నానని, కొన్ని కారణాల వల్ల 2020 లో తన భర్తతో విడాకులు తీసుకున్నానని, ఏడాదిన్నర క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో క్రికెటర్ కేసీ కార్యప్ప పరిచయం అయ్యాడని, ఆ తర్వాత మా ఇద్దరికీ శారీరక సంబంధం ఏర్పడిందని, దీంతో నేను గర్భం దాల్చడంతో తన ప్రియుడు కార్యప్ప తనతో బలవంతంగా అబార్షన్ చేయించాడని, ఈ విషయమై గతంలో బాగల్‌గుంటె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని కేసీ కార్యప్ప మాజీ ప్రియురాలు ఇప్పుడు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తర్వాత తన ప్రియుడు కార్యప్ప అభ్యర్థన మేరకు అతని మీద పెట్టిన కేసును తాను ఉపసంహరించుకున్నానని ఆ యువతి అంటోంది. తన ప్రియుడు కార్యప్ప తల్లిదండ్రులు తనను కలిసి నీ అంతు చూస్తామని బెదిరించారని, నేను కరియప్పను కలవడం తప్పు అని చెప్పారని, మీరు ఇద్దరు పెళ్లి చేసుకుని కలిసి జీవించడం మాకు ఇష్టం లేదని వారు చెప్పారని యువతి ఆరోపించింది. తన ప్రియుడు కార్యప్ప ఇప్పటికే తన దగ్గర అంచెలంచెలుగా రూ. 2 లక్షలు డబ్బులు కూడా తీసుకున్నాడని యువతి ఆరోపిస్తోంది.

విడాకులు తీసుకున్న నువ్వు మా కుమారుడు కార్యప్పను పెళ్లి చేసుకోకూడదని అతని తల్లిదండ్రులు తనతో దుర్భాషలాడారని యువతి ఆమె ఫిర్యాదులో పేర్కొంది.డిసెంబర్ 18వ తేదీన క్రికెటర్ కేసీ కార్యప్ప నా ఇంటికి వచ్చి మీరు ఇప్పటికే విడాకులు తీసుకున్నారని, నిన్ను చూడటం నాకు ఇష్టం లేదని, అందుకే నిన్ను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడని, నేను మీ నుండి ఎటువంటి డబ్బు తీసుకోలేదని రెచ్చిపోయి నాపై దాడి చేసి అసభ్యంగా దూషించాడని యువతి ఆరోపిస్తోంది.

cricketer KC Kariappas ex-girlfriend has filed a case against him for forcing her to have an abortion.

తనను చంపేస్తానని బెదిరించి నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పి తనను కార్యరప్ప మోసం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆమెకు ఇంతకు ముందు పెళ్లై విడాకులు తీసుకున్న విషయం నాకు తెలియదని, ఆమె నన్ను మానసికంగా వేధిస్తోందని, ఆమె వల్లే నా క్రికెట్ కెరీర్ నాశనం అయిపోతోందని క్రికెటర్ కేసీ ఆరోపిసస్తున్నాడు. తాను ఆమెకు అబార్షన్ చేయించలేదని కార్యప్ప ఆరోపిస్తున్నాడు.

తనకు బిడ్డ కావాలని కార్యప్పతో శారీరక సంబంధం పెట్టుకున్న మాట వాస్తవం అని, తాను గర్బవతి అయిన తరువాత కార్యకప్ప తనతో బలవంతంగా మాత్రలు మింగించి అబార్షన్ చేయించాడని కార్యప్ప మీద అతని మాజీ ప్రియురాలు ఆరోపణలు చేస్తోంది. రెండు కేసులు ఇప్పుడు విచారణలో ఉన్నాయి. మొత్తం మీద కర్ణాటక క్రికెటర్ కేసీ కార్యప్ప పంచాయితీ ఇప్పుడు రచ్చరచ్చ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+