రాజ్యసభ మార్షల్స్ కొత్త యూనిఫాం రగడ ... సమీక్షించాలని చైర్మన్ వెంకయ్య నాయుడు ఆదేశం
రాజ్యసభ మార్షల్స్ యొక్క కొత్త యూనిఫాంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న వేళ సభలో కొత్త సైనిక తరహా మార్షల్స్ యూనిఫాంను సమీక్షించాలని రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు మంగళవారం ఆదేశించారు.కొంతమంది మాజీ ఆర్మీ అధికారులు మార్షల్స్ కోసం రూపొందించిన కొత్త యూనిఫాంలను చట్టవిరుద్ధమని విమర్శించారు. భారత ఆర్మీ మాజీ చీఫ్ వేద్ మాలిక్ ఈ విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. దీనిని చట్టవిరుద్ధంగానూ ,భద్రతాపరమైన ప్రమాదం గానూ ఆయన పేర్కొన్నారు.
సాంప్రదాయ భారతీయ వస్త్రధారణ నుండి సైనిక తరహా దుస్తులు మరియు క్యాప్ లతో వారి యూనిఫాంలు మార్చటంతో మార్షల్స్ ఒక ఆర్మీలా కనిపిస్తున్నారు. అందుకే భారత ఆర్మీ మాజీ చీఫ్ వేద్ మాలిక్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమంది మాజీ ఆర్మీ అధికారులు విమర్శలు, ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యల నేపథ్యంలో వచ్చిన చర్చతో మార్షల్స్ యొక్క కొత్త సైనిక తరహా యూనిఫాంను సమీక్షించాలని రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు మంగళవారం ఆదేశించారు.

సభా సాంప్రదాయాల ప్రకారం సభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇద్దరు మార్షల్స్ చేత చైర్మన్ ముందు కవాతు చేస్తారు. ఆ తరువాత సభాధ్యక్షుడు కార్యకలాపాల ప్రారంభాన్ని ప్రకటిస్తారు మరియు సభ నిర్వహించడానికి మరియు ఆర్డర్ పేపర్లను తీసుకురావడంలో రాజ్య సభ చైర్మన్ కు మార్షల్స్ సహాయం చేస్తారు.సోమవారం, మార్షల్స్ కొత్త యూనిఫామ్‌ను ధరించి వచ్చినప్పుడు, కొంతమంది సభ్యులు "మార్షల్ చట్టం కూడా విధించబడింది " అని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ మార్షల్స్ కొత్త యూనిఫాం అంశాన్ని లేవనెత్తాలని కోరారు. "సర్, మార్షల్స్ యూనిఫాం విషయంలో చర్చ జరగాలని కోరటంతో వెంకయ్య నాయుడు మార్షల్స్ యూనిఫాం విషయంలో సమీక్ష జరపాలని ఆదేశించారు.
మార్షల్స్ అంతకుముందు వేసవి నెలల్లో సఫారీ సూట్లు మరియు శీతాకాలంలో భారతీయ బంధగల్ సూట్ లను టర్బన్‌లతో పాటు ధరించేవారు. తాజా మారిన వారి కొత్త యూని ఫాం విషయంలో వేద్ మాలిక్ ట్వీట్ చేస్తూ ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్‌లను తన ట్వీట్‌లో ట్యాగ్ చేసిన మాలిక్, రక్షణ మంత్రి ముందస్తు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఇక సభలో సైతం మార్షల్స్ కొత్త యూనిఫాం విషయంలో ప్రస్తావన రావటంతో వెంకయ్య నాయుడు పునః పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.
Recommended Video
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications