ఛత్తీస్‌గఢ్ పోలింగ్ వేళ.. పేలిన మావోయిస్టుల మందుపాతర

ఛత్తీస్‌గఢ్ పోలింగ్ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో పోలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. అధికార పార్టీని ఎన్నుకుంటోన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ, మిజోరంలో ఒకే విడతలో ఈ పోలింగ్ పూర్తవుతుంది.

ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటోన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్‌ను నిర్వహించింది.

CRPF Jawan injured in IED blast planted by the Maoist in Sukma

మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ 20 నియోజకవర్గాలు కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉండటమే దీనికి కారణం. మొత్తం 40 లక్షలమందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 5,304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున భద్రత బలగాలను మోహరించారు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. పారా మిలటరీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్రీయ రిజర్వ్ పోలీస్ దళాలను రంగంలోకి దించారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు.

ఈ పరిణామాల మధ్య ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు సంభవించింది. పోలింగ్ ఆరంభమైన గంట వ్యవధిలోనే సుక్మా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండే జిల్లా ఇది. ఈ ఘటనలో పోలింగ్ విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడ్డ జవాన్‌ను కోబ్రా 206 బెటాలియన్, సీఆర్పీఎఫ్ పర్సనల్ క్యాంప్‌కు చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఎల్మగుండ గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తోన్న సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్ మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై ఆయన కాలుపెట్టారు. దీనితో భారీ శబ్దం చేస్తూ అది పేలింది. కుంట తాలూకా పరిధిలో తెలంగాణ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది ఎల్మగుండ గ్రామం.

ఈ ఘటనలో శ్రీకాంత్ కాలికి తీవ్రగాయమైంది. హుటాహుటిన ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్య చికిత్సను అందిస్తోన్నారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని సుక్మా జిల్లా పోలీస్ ఉన్నతాధికారి కిరణ్ చవాన్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+