వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సైబర్ నేరగాళ్ల వల.. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి తప్పని బెడద
ఢిల్లీ : టెక్నాలజీ పెరిగిపోయింది. అదేసమయంలో సైబర్ క్రైమ్ సంఖ్య కూడా వీపరీతంగా పెరిగింది. ఈక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకుర్ కు సైతం సైబర్ నేరగాళ్ల ముప్పు తప్పలేదు. ఆయన పేరిట గుర్తుతెలియని వ్యక్తి మెయిల్స్ పంపిస్తుండటం కలకలం రేపింది. సదరు సైబర్ నేరగాడు తనకు తాను జస్టిస్ లోకుర్ నంటూ చెబుతూ కొందరిని ప్రభావితం చేసేలా ప్రయత్నించడం గమనార్హం.

సుప్రీంకోర్టు కంప్యూటర్ డిపార్టుమెంట్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఈ విషయంపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాడు ఎవరెవరికైతే మెయిల్స్ పంపాడో వాటి వివరాలు ఆయనకు అందించారు. దీంతో ఎఫ్‌ఐఆర్ నమోదుచేసిన పోలీసులు త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామన్నారు. సదరు నేరగాడికి సంబంధించిన వివరాలు తెలిశాయని తెలిపారు.