Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cyclone Michaung: కొట్టుకుపోయిన కార్లు- ట్రాఫిక్‌కు అడ్డం పడ్డ మొసలి

Chennai rains: బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛౌంగ్ తుఫాన్ రెండు రాష్ట్రాలను వణికిస్తోంది. పెను తుఫాన్‌గా ఆవిర్భవించిన మిఛౌంగ్ ప్రభావంతో ఏపీ, తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోన్నాయి.

ఈ తుఫాన్ ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నెల్లూరు- మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటనుంది. ఈ నెల 5వ తేదీన ఉదయం నెల్లూరు- మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

 Cyclone Miachuang: Chennai submerged after very heavy rain

ప్రస్తుతం గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది మిఛౌంగ్ తుఫాన్. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఈ వర్షాల తీవ్రత మరింత ఉధృతమౌతుంది. తీరాన్ని దాటేంత వరకూ వర్షాలు దంచికొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

చెన్నై సహా తమిళనాడులోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తాంబరం ప్రాంత ప్రజలను ప్రభుత్వం ఖాళీ చేయించింది. వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించింది. భారీ వర్షంలోనూ మంత్రి ఉదయనిధి స్టాలిన్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.

 Cyclone Miachuang: Chennai submerged after very heavy rain

చెన్నైలోని తాంబరం, రాయపేట, కోడంబాక్కం, వెస్ట్ మాంబళం, చిదాద్రి పేట, చింతాద్రిపేట, ఆర్యగౌడనగర్.. వంటి అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. నడుం లోతు వరకు నీళ్లు చేరాయి. ఫలితంగా ఆయా ఇళ్లల్లోకి వరదనీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

 Cyclone Miachuang: Chennai submerged after very heavy rain

వరద నీరు ప్రవాహంలా తన్నుకురావడంతో అనేక చోట్ల కార్లు కొట్టుకుపోయాయి. నెడుంగుండ్రం సమీపంలోని వెలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సమీపంలో రోడ్డుపై ఓ భారీ మొసలి కనిపించింది. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు దీన్ని గుర్తించారు. దీనితో నెడుంగుండ్రం చెరువు పరిసర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+