Daily Hunt పై మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరియు వేగవంతమైన అప్‌డేట్స్..!
డైలీహంట్ పై నాగాలాండ్ త్రిపురా మేఘాలయ ఎన్నికల ఫలితాలు 2023
ఈశాన్య రాష్ట్రాల్లోని మూడు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మార్చి 2వ తేదీ వెలువడుతాయి. త్రిపురా, మేఘాలయా, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈవీఎంలలో ఫలితాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఎవరి భవితవ్యం ఏమిటో మార్చి 2వ తేదీన తెలుస్తుంది.
త్రిపురా:
త్రిపురా అసెంబ్లీకి 60 స్థానాలుండగా 2018లో బీజేపీ-ఐపీఎఫ్‌టీ పార్టీలు విజయం సాధించి అధికారం చేపట్టింది. అప్పటి వరకు త్రిపురాలో కమ్యూనిస్టులదే రాజ్యం నడిచేది. బీజేపీ 35 స్థానాల్లో గెలుపొందగా ఐపీఎఫ్‌టీ 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి తిరిగి బీజేపీ అధికారం చేపడుతుందా లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఎందుకంటే త్రిపురాలో బీజేపీపై కాస్త వ్యతిరేకత ఎక్కువగానే ఉంది.ఇక కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలు ఈసారి కూడా కలిసి పోటీ చేశాయి. అయితే ఈ రెండు పార్టీలకు టీఎంసీ నుంచి కాస్త ఇబ్బంది పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. త్రిపురాలో గిరిజనుల ఓట్లు కీలకం కానుండగా... బీజేపీకి త్రిప్రా మోతా పార్టీ తీవ్రమైన పోటీనిస్తోంది. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు గ్రేటర్ తిప్రలాండ్ డిమాండ్ చేస్తున్నాయి.

నాగాలాండ్:
నాగాలాండ్‌లో యునైటెడ్ డెమొక్రటిక్ అలయన్స్ (యూడీఏ) బలోపేతంగా తయారైంది. అక్కడ ప్రతిపక్షమే లేదు. 2018లో నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) అత్యధికంగా 27 సీట్లు గెలిచి అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది.అయితే బీజేపీ ఎన్‌డీపీపీ, జనతాదళ్ యునైటెడ్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2021లో ఎన్‌పీఎఫ్ కూడా ఈ సంకీర్ణ ప్రభుత్వంలో చేరింది. అయితే 21 మంది ఎమ్మెల్యేలు గతేడాది ఎన్‌డీపీపీలో చేరారు. ఈసారి మొత్తం 60 సీట్లకుగాను బీజేపీ 20 సీట్లలో పోటీచేస్తుండగా మరో 40 స్థానాల్లో ఎన్‌డీపీపీకి మద్దతునిస్తోంది.
మేఘాలయా:
2018 ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) 19 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ 21 స్థానాలు బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించాయి. యూడీపీ 6 స్థానాలను దక్కించుకుంది. అయితే బీజేపీ, యూడీపీ, ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్‌పీపీ మేఘాలయా డెమొక్రటిక్ అయన్స్ పేరుతో అధికారంలోకి వచ్చింది. ఈసారి బీజేపీ ఎన్‌పీపీ పొత్తు లేదు.మరోవైపు టీఎంసీ రాష్ట్రంలో బలంగా తయారైంది. టీఎంసీ నుంచి మాజీ సీఎం ముకుల్ సంగ్మా పోటీ చేశారు. ప్రస్తుత సీఎం, ఎన్‌పీపీ చీఫ్ కాన్రడ్ సంగ్మా, మాజీ సీఎం ముకుల్ సంగ్మాలు గారో హిల్స్ ప్రాంతం నుంచి పోటీలో ఉన్నారు.
డైలీ హంట్ కవరేజ్
ఇక ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రముఖ న్యూస్ అగ్రిగేటర్ డైలీహంట్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఎన్నికలంటే కేవలం అంకెలు మాత్రమే కాదు. డేటా సేకరణ దగ్గర నుంచి ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు ఇస్తాము.ఏ అంశాలైతే ఓటరును ప్రభావితం చేశాయి.. ఎందుకు ప్రభావితులయ్యారు అనే అంశాలపై చక్కటి కథనాలను అందిస్తాము.ఒక్కసారి ఫలితాలు వెలువడగానే అన్ని కోణాల నుంచి విశ్లేషణలు చకచకా మీ ముందుంటాయి. ఫలితాలపై విశ్లేషణలు సామాన్యుడి నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు ఉంటాయి.
ఫలితాలపై డైలీ హంట్‌లో ఇంకా ఏముంటాయంటే..?
* లైవ్‌తో పాటు దేశవ్యాప్తంగా వేగవంతమైన అప్‌డేట్స్
* ఫలితాలు, గత ఫలితాలతో పోలుస్తూ విశ్లేషణలు
* నియోజకవర్గాల వారీగా మార్పులు చేర్పులపై అప్‌డేట్స్
* సోషల్ మీడియా రియాక్షన్స్, ట్విటర్ ట్రెండ్స్
* లైవ్ వీడియోలు, వైరల్ మీమ్స్, ట్రెండింగ్ కథనాలతో పాటు మరెన్నో ఇతరత్ర అంశాలు ఈ ఎన్నికల కవరేజ్‌లో పొందొచ్చు. ఇందుకోసం డైలీహంట్‌కు ట్యూన్ అవ్వండి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications