దళితుడిని నగ్నంగా చేసి దాడి, ఊరేగింపు, వీడియో తీసి సోషల్ మీడియాలో, వైరల్!
బెంగళూరు: కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో దళితుడిని నగ్నంగా తయారు చేసి దాడి చేస్తూ గ్రామం మొత్తం ఊరేంగిచిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దళితుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరిని అరెస్టు చేశామని, పరారైన నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం మేరకు చామరాజగర్ జిల్లా గుండ్లుపేట తాలుకా కచ్చేకట్టె గ్రామానికి చెందిన దళితుడు ప్రతాప్ ను జూన్ 3వ తేదీ నగ్నంగా తయారు చేసి గ్రామం మొత్తం ఊరిగిస్తూ అతని మీద దాడి చేశారు. ఆ సందర్బంలో కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడంతో వైరల్ అయ్యింది.

చామరాజనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దళితుడు ప్రతాప్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరిని అరెస్టు చేశారు. నలుగురు యువకులు పరారైనారు. ప్రతాప్ చాల కాలం నుంచి మానసిక అస్వస్తతకు గురైనాడని గ్రామస్తులు అంటున్నారు.
ప్రతాప్ కు వైద్య కిచిత్స చేపిన పత్రాలను అతని తండ్రి పోలీసులకు ఇచ్చాడని జిల్లా ఎస్పీ అంటున్నారు. ప్రతాప్ మైసూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు అన్నారు. ప్రతాప్ పట్ట ఇలాంటి నీచమైన పని చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని అతని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications