బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్యాన్స్ నేర్పిస్తా రా: విద్యార్థినిపై రేప్ చేసిన డ్యాన్స్ మాస్టర్, కటకటాలు !

బెంగళూరులోని బాణసవాడిలో డ్యాన్స్ నేర్చుకోవడానికి వస్తున్న 23 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి తప్పించుకు తిరుగుతున్న డ్యాన్స్ మాస్టర్ క్రిస్టోఫర్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన యువతిని నమ్మించి మోసం చేసి అత్యాచారం చేసి తప్పించుకు తిరుగుతున్న డ్యాన్స్ మాస్టర్ ను బెంగళూరులోని బాణసవాడి పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

బెంగళూరులోని టిన్ ఫ్యాక్టరీ-హెబ్బళ రింగ్ రోడ్డు సమీపంలోని బాణసవాడిలో డ్యాన్స్ మాస్టర్ క్ట్రిష్టోఫర్ అలియాస్ క్రిస్టీ అలియాస్ క్రిస్టినో (35) నివాసం ఉంటున్నాడు. ఇతను బాణసవాడి పరిసర ప్రాంతాల్లోని వారికి డ్యాన్స్ నేర్పిస్తున్నాడు.

Dance teacher arrested on charges of raping student in Bengaluru

కేరళలో ప్రసిద్ది చెందిన ఏరోబిక్ డ్యాన్స్ నేర్పించడంలో క్రిస్టోఫర్ కు మంచి పేరు ఉంది. 2014లో తన డ్యాన్స్ స్కూల్ లో విద్యార్థులకు శిక్షణ ఇస్తామని ప్రకటనలు ఇచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న 23 ఏళ్ల యువతి డ్యాన్స్ స్కూల్ లో చేరింది.

డ్యాన్స్ నేర్పిస్తున్న సమయంలో క్రిస్టోఫర్ ఆమెకు దగ్గర అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెను లోంగదీసుకుని బలవంతంగా శారీరకంగా దగ్గర అయ్యాడు. 2016 వరకు ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారని సమాచారం.

2017 ఫిబ్రవరి నుంచి ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఏమిటని ప్రశ్నిస్తే నీకు దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించడం మొదలు పెట్టడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రిస్టోఫర్ మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, యువతిని వైద్య పరీక్షలకు తరలించి దర్యాప్తు చేస్తున్నామని బాణసవాడి పోలీసులు తెలిపారు.

English summary
A 35-year-old dance master was arrested on charges of raping a 23-year-old student after promising to marry her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X