అందంగానే కాదు...: కేంద్రమంత్రికి దంగల్ నటి ఝలక్

దంగల్ సినిమా నటి జైరా వసీం మరోసారి వివాదానికి కేంద్రబింధువు అయింది. అయితే, ఈ వివాదం ఆమె సృష్టించింది కాదు. కేంద్రమంత్రి వివాదాన్ని రేపారు.

న్యూఢిల్లీ: దంగల్ సినిమా నటి జైరా వసీం మరోసారి వివాదానికి కేంద్రబింధువు అయింది. అయితే, ఈ వివాదం ఆమె సృష్టించింది కాదు. కేంద్రమంత్రి వివాదాన్ని రేపారు. ఆయన ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో గురువారం ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను గురువారం ఆర్టి ఎగ్జిబిషన్ ప్రారంభించారు.

గ్యాలరీలోని ఓ బొమ్మను జైరా వసీంకు అన్వయించారు. పంజరంలో బందీ అయిన ముస్లీం యువతి బొమ్మను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో జైరా వసీం పరిస్థితికి అద్దం పట్టేలా ఉందని, మన బాలికలు పంజరాన్ని బద్దలు కొట్టి ముందుకు సాగుతున్నారని విజయ్ గోయల్ పేర్కొన్నారు.

Dangal actress Zaira Wasim in fresh row; spars with sports minister Vijay Goel on Twitter

ఆ తర్వాత, జైరా వసీం.. కేంద్రమంత్రి పోలికను తప్పుబట్టారు. సార్.. మీరు వర్ణించినట్లు ఈ బొమ్మకు తాను ఎలా కనెక్ట్ అవుతానని ప్రశ్నించింది. అసలు ఆ బొమ్మకు, తనకు కనీస సారూప్యత లేదని తెలిపింది. బురఖా వేసుకునే వాళ్లు అందంగానే కాకుండా, స్వేచ్ఛగాను ఉంటారని పేర్కొంది.

దీనిపై మంత్రి ప్రతిస్పందించారు. తన ఉద్దేశ్యాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావని, నీ పరిధిలో నువ్వు ఎంతో సాధించావని, అలాగే కట్టుబాట్లు, నిబంధనలను తెంచుకుంటూ బాలికలు ఎదగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+