Daughter: కూతురు పెళ్లిపీటల మీద కుర్చునే రోజు తండ్రి ఆత్మహత్య, వార్నింగ్ ఇచ్చారని ఎంతపని చేశాడు !

లక్నో/ఉత్తరప్రదేశ్: వ్యవసాయం చేస్తున్న వ్యక్తికి ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయం చేస్తున్న రైతు మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. ఉదయం నిద్రలేచిన తరువాత అందరూ టీలు, కాఫీలు తాగితే మనోడు క్వాటర్ బాటిల్ ఓపెన్ చేసి మద్యం సేవిస్తున్నాడు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆ రైతు మద్యం మత్తులోనే ఉంటున్నాడు. కూతురి పెళ్లి ఫిక్స్ అయ్యింది. మద్యాహ్నం కూతురి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఉదయం కుటుంబ సభ్యులు నిద్రలేచి చూస్తే పెళ్లికూతురి తండ్రి ఇంటి వెనుక తాడుకు వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది.

 భలే మందుబాబు

భలే మందుబాబు

ఉత్దరప్రదేశ్ లోని మోహన్ లాల్ గంజ్ ప్రాంతంలోని తిక్రా గ్రామంలో సునీల్ దివ్వేది అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సునీల్ దివ్వేది వ్యవసాయం చేయిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి సునీల్ దివ్వేది మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. మందు తాగనిదే సునీల్ దివ్వేది ఎలాంటి పని చెయ్యడని తెలిసింది.

 ఉదయం నుంచి రాత్రి వరకు అదే పని

ఉదయం నుంచి రాత్రి వరకు అదే పని

ఉదయం నిద్రలేచిన తరువాత సునీల్ దివ్వేది క్వాటర్ బాటిల్ ఓపెన్ చేసి మద్యం సేవించిన తరువాత టిఫిన్ తిని బయటకు వెలుతున్నాడు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు సునీల్ దివ్వేది మద్యం మత్తులోనే ఉంటున్నాడు. కూలీలనలు పెట్టి వ్యవసాయం చేయిస్తున్న సునీల్ దివ్వేది అతను మాత్రం మద్యం సేవించి జల్సా చేస్తున్నాడు.

కూతురి పెళ్లి ఫిక్స్ అయ్యింది

కూతురి పెళ్లి ఫిక్స్ అయ్యింది

సునీల్ దివ్వేది కూతురికి గత నెలలో పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్లికి బంధువులు అందరూ అతని ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు పెళ్లి ముహూర్తం ఉంది. మరుసటి రోజు సునీల్ దివ్వేది కూతురి మెడలో పెళ్లికొడుకు తాళి కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ పెళ్లి హడావిడిలో ఉన్నారు.

వార్నింగ్ ఇచ్చిన కుటుంబ సభ్యులు

వార్నింగ్ ఇచ్చిన కుటుంబ సభ్యులు

ఉంటే ముహూర్తానికి ముందు రోజు సాయంత్రం సునీల్ దివ్వేది పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. పెళ్లి ఇంటిలో సునీల్ దివ్వేది చిందులు వేశాడు. కూతురి పెళ్లి పెట్టుకుని పీకలదాక మద్యం సేవించడానికి నీకు సిగ్గులేదా ? అని కుటుంబ సభ్యులు, బంధువులు సునీల్ దివ్వేదిని మందలించారు. మరుసటి రోజు కూతురి పెళ్లిముహూర్తం ఉందని, ఆ రోజు మద్యం సేవించకూడదని అందరూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

 తండ్రి ఆత్మహత్యతో కూతురి పెళ్లి ఆగిపోయింది

తండ్రి ఆత్మహత్యతో కూతురి పెళ్లి ఆగిపోయింది

ఉదయం కుటుంబ సభ్యులు నిద్రలేచి చూస్తే పెళ్లికూతురి తండ్రి సునీల్ దివ్వేది ఎక్కడా కనపడలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు సునీల్ దివ్వేది కోసం వెతికారు. ఇంటి వెనుక పశువుల పాకలో సునీల్ దివ్వేది తాడుకు వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది. తండ్రి సునీల్ దివ్వేది ఆత్మహత్యతో ఆయన కూతురి పెళ్లి ఆగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+