Wife: భార్య అక్రమ సంబంధం లీక్, భర్త, అత్తను ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్ లో పెట్టింది, క్లైమాక్స్ !

భర్త, అత్తను చంపేసి ఇద్దరి శవాలను ముక్కలు ముక్కలు చేసిన కోడలు ఆ ముక్కలు కుళ్లిపోకుండా ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిందని వెలుగు చూసింది. తన అక్రమ సంబంధాన్ని డైరెక్టుగా చూడటంతో ఇద్దరిని కిలాడీ కోడలు చంపేసింది

గుహవాటి/ అసోం: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం మాత్రమే సంతోంగా కాపురం చేశారు. తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. రానురాను పెద్దలు పంచాయితీలు చేశారు. భార్య తీరు మారకపోవడంతో భర్త రాజీ అవుతూ చాలా సంవత్సరాలు కాపురం నెట్టుకు వస్తున్నాడు. కొన్ని నెలల క్రితం తన భర్త, అత్త కనపడటం లేదని భార్య కేసు పెట్టింది. పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసినా తల్లీ కొడుకుల మిస్సింగ్ కేసులో ఎలాంటి క్లూ చిక్కలేదు. ఇదే సమయంలో మాయం అయిన వ్యక్తి సోదరి భర్త ఎంట్రీతో మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. భర్త, అత్తను చంపేసి ఇద్దరి శవాలను ముక్కలు ముక్కలు చేసిన కోడలు శవం కుళ్లిపోకుండా ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిందని వెలుగు చూడటం కలకలం రేపింది. తన అక్రమ సంబంధాన్ని డైరెక్టుగా ఇద్దరూ చూడటంతో ఇద్దరిని కిలాడీ కోడలు చంపేసిందని పోలీసులు అన్నారు.

 దంపతుల మధ్య గొడవలు

దంపతుల మధ్య గొడవలు

అసోంలోని గుహవాటిలో అమరేంద్ర దే అలియాస్ అమరేంద్ర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్రాల క్రితం అమరేంద్ర బందనా కలితా అలియాస్ బందనా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న అమరేంద్ర, బందనా దంపతులు కొంతకాలం మాత్రమే సంతోంగా కాపురం చేశారు. తరువాత అమరేంద్ర, బందనా దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. రానురాను పెద్దలు పంచాయితీలు చేశారు. భార్య బందనా తీరు మారకపోవడంతో అమరేంద్ర ఆమెతో రాజీ అవుతూ చాలా సంవత్సరాలు కాపురం నెట్టుకు వస్తున్నాడు.

 మిస్సింగ్ కేసు పెట్టిన కోడలు

మిస్సింగ్ కేసు పెట్టిన కోడలు

అమరేంద్ర, అతని తల్లి శంకరిదేవి, భార్య బందనాతో కలిసి నివాసం ఉంటున్నాడు. 7 నెలల తన అత్త శంకరిదేవి, భర్త అమరేంద్ర కనపడటం లేదని బందనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు తన భర్తకు నిత్యం గొడవలు జరుగుతున్నాయని, ఇద్దరూ విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అవుతున్న సమయంలో తన భర్త అమరేంద్ర, అత్త శంకరదేవి కనపడకుండా పోయారని బందనా పోలీసులకు చెప్పింది.

 బావమరిది ఎంట్రీతో ?

బావమరిది ఎంట్రీతో ?

పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసినా తల్లీ కొడుకుల మిస్సింగ్ కేసులో ఎలాంటి క్లూ చిక్కలేదు. తన భర్త అమరేంద్రకు తనకు గొడవలు ఉన్నాయని బందనా డైరెక్టుగా చెప్పడంతో పోలీసులకు ఆమె మీద కూడా అనుమానం రాలేదు. అయితే 7 నెలల తరువాత అమరేంద్ర సోదరి భర్త నేరుగా గుహవాటి పోలీసు కమీషనర్ కు బందనా మీద ఫిర్యాదు చేశాడు. బందనానే ఆమె భర్త అమరేంద్ర, అత్త శంకరి దేవిని హత్య చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

 అక్రమ సంబంధం. డైరెక్టుగా చిక్కిపోయిన కోడలు

అక్రమ సంబంధం. డైరెక్టుగా చిక్కిపోయిన కోడలు

బందనాకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. అమరేంద్రతో వివాహం అయిన తరువాత కూడా బందనా ఆమె అక్రమ సంబంధాన్ని కొనసాగించింది, 8 నెలల క్రితం ప్రియుడు ధన్విత్ దేఖను ఇంటికే పిలిపించుకున్న బందనా అతనితో ఎంజాయ్ చేసింది. ప్రియుడితో మంచి రసపట్టులో ఉన్న సమయంలో ఆమె అత్త శంకరిదేవి ఇంట్లో వెళ్లి ఇద్దరిని నగ్నంగా చూసింది. కోడలు బందనా అక్రమ సంబంధం విషయం గురించి శంకరి దేవి ఆమె కొడుకు అమరేంద్రకు చెప్పింది.

 ప్రియుడితో కలిసి అత్తా, భర్తను చంపేసిన కోడలు

ప్రియుడితో కలిసి అత్తా, భర్తను చంపేసిన కోడలు

నువ్వు పద్దతి మార్చుకోకపోతే ఇంటి నుంచి బయటకు తోసేసి విడాకులు ఇస్తానని, నా ఆస్తిలో నీకు భాగం కూడా ఇవ్వనని అమరేంద్ర అతని భార్య బందాను హెచ్చరించాడు. ఇక లాభం లేదని అనుకున్న బందనా 7 నెలల క్రితం ఆమె ప్రియుడు ధన్విత్ ను ఇంటికి పిలిపించుకుని భర్త అమరేంద్ర, అత్త శంకరిదేవిని కత్తులతో పొడిచి చంపేశారు. ఒక రోజు మొత్తం ఇద్దరి శవాలను ముక్కలు ముక్కలు చేసి ఇంట్లోని ఫ్రిడ్జ్ లో దాచిపెట్టారు. మూడు రోజుల వరకు ఇద్దరి శరీరాల ముక్కలను అదే ఫ్రిడ్జ్ లో పెట్టారు.

 మేఘాలయాలో ఇద్దరి శవాల ముక్కలు విసిరేశారు

మేఘాలయాలో ఇద్దరి శవాల ముక్కలు విసిరేశారు

మూడు రోజుల తరువాత ప్లాస్టిక్ కవర్లలో ఇద్దరి శవాల ముక్కలను ప్యాక్ చేసిన బందనా, ఆమె ప్రియుడు ధన్విత్ వాటిని అసోంలో కాకుండా మేఘాలయాలోని అటవి ప్రాంతంలోకి తీసుకెళ్లి విసిరేశారు. అయితే క్రిమినల్ కోడలు బందనా శరీర భాగాలను ప్యాక్ చేసిన ప్లాస్టిక్ కవర్లు పారేయకుండా వాటిని కాల్చి బూడిద చేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భర్త, అత్తను హత్య చేసిన బందనా 7 నెలల తరువాత పోలీసులకు చిక్కడం అసోంతో పాటు దేశవ్యాప్తంగా కలకలకం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+