వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్‌కి అమ్ ఆద్మీ లేఖ

|
Google Oneindia TeluguNews

ప్రియమైన అరవింద్ గారికి,

నేను ఈ లేఖను ఎంతో ఆశతోనూ.. అంతే భయంతోనూ రాస్తున్నాను. నా అభిప్రాయాలను మీరు పరిగణలోకి తీసుకుంటారని, బోర్డు ముందు ఉంచుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నాకు కొన్ని సార్లు మీతో సంభాషించే అవకాశం వచ్చింది, మీ దగ్గరికి రాలేకపోయాను. ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో కాంగ్రెస్ నిష్క్రమించింది, మరో ఐదేళ్లలో జాతీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ఆశించా. ఒక ఉద్యమానికి, కుటుంబం పేరుకు జరిగిన యుద్ధంలో ఉద్యమమే విజయం సాధించింది.

Dear Kejriwal, as of now AK is AAP and vice versa

పలు సమస్యలను పరిష్కరించుకునేందుకు, అనేక హక్కులను సాధించేందుకు ప్రజలందరూ మీకు బహిరంగంగా మద్దతు పలికారు. అయితే ప్రస్తుత రాజకీయ క్రమంలో తాము కోరుకున్నవి సాధించుకోవడంలో విఫలమయ్యామని గుర్తించాం. ఆప్ ఇప్పటికీ ఒక స్వయంచాలక ఎంపిక కాదని తెలుసుకున్నాం. ఇది పూర్తిగా మీ వైఫల్యమే, మీ అగ్రహాన్ని, అసంతృప్తిని మీ మద్దతుదారుల కోసం ఉపయోగించలేదు. మీ విషయంలో నేను వ్యక్తిగతంగా చాలా ఆరోపణలు ఎదుర్కొన్నాను. మీ రాకతో పాతుకుపోయిన పాత రాజకీయాలకు ముగింపు కలుగుతుందని ఆశించి ప్రజలు, సామాజిక కార్యకర్తలు మీకు మద్దతు పలికారు. నేను పది అంశాల్లో ఆప్ గురించి ఆందోళన చెందుతున్నాను. అవి:

1. మీరు అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో ఏం సాధించారనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీ రిపోర్ట్ కార్డ్- 1984 అల్లర్లపై సిట్, ఎండిఏపై ఎఫ్ఐఆర్, నీరు, విద్యుత్ సరఫరాపై సబ్సిడీ ఇవే మీరు ఇచ్చిన గొప్ప హామీలా. మీ సామర్థ్యం ఇంతకంటే ఎక్కువగా ఉందని ఆశించాం, అయితే ఎన్నికల సమయంలో రాజకీయాలేమైనా చేశారా?

2. ఇప్పుడు ఏకె (అరవింద్ కేజ్రివాల్) అంటే ఆప్‌. అయితే మీరు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారా? లేక పార్లమెంటులో నాయకుడిలా ఉండాలనుకుంటున్నారా?. నేను మీకు ఓటు వేశాను.. మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి కావాలని ఓటు వేశానా లేక ప్రధానమంత్రి కావాలని ఓటేశానా?. అయితే మీరు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎందుకు డెవలప్ చేయలేదు? మీకు స్పష్టతా, ముందు చూపు, సమగ్రత ఉండి కూడా మీ తర్వాత నాయకత్వాన్ని గుర్తించడంలో విఫలమయ్యారా?.

3. మీరు మీ ఆలోచనపై స్పష్టంగా.. అనర్ఘళంగా మాట్లాడగల వక్త. మీ వ్యాఖ్యలు ఉద్యమం చేయడానికే పనికి వస్తాయి.. కానీ ప్రభుత్వాన్ని నడిపించేందుకు కాదు. అక్కడ చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒకే బ్రష్‌తో అనేక పెయింటింగ్స్ వేయాల్సి ఉంటుంది. మీకు నిగ్రహంపై సాధన ఉంటే దూకుడు తగ్గించడంపై దృష్టి పెడితే సహాయపడుతుంది.

4. మీపై మీ పార్టీకి చెందిన చాలా మంది నాయకులు వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు. మీ నిజాయితీపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మీ పార్టీ ఇతర పార్టీలకంటే కూడా ముందుంది.

5. ఉన్నతాధికారులు, చట్టాలు అమలు చేసే సంస్థలు అవినీతిలో కూరుకుపోయాయని, అసమర్థంగా తయారయ్యాయని మీకు అవగాహన ఉంది. ఆ అంశాన్ని మీరు ఆసాంతం గుర్తించి ఉంటే మీకు ఎంతో ఉపయోగపడేది.

6. లాభాల కోసం పని చేయడం నేరం కాదు. ప్రస్తుతం ఉన్న కొత్త ప్రపంచంలో అలాంటి విధానాలు కొనసాగుతున్నాయి. లాభాలకు లాభాలను ఆర్జించడానికి చాలా అంతరం ఉంది. మీ సిఐఐ అడ్రెస్‌తో నేను చాలా సంతోషంగా ఉన్నా. ఈ విధానాన్ని తరచూ పాటిస్తే మీకు సహాయపడగలదు.

7. మీరు రూపొందించే మార్గాలు ‘నా మార్గం లేదా జాతీయ మార్గం'లా ఉంది. మీరు వీటిపై పరిశీలన చేయాల్సి ఉంది. నిర్ణయం తీసుకోవడంలో స్పష్టం ఉండాలి. పరిపాలన విధానం, మీడియా సమావేశాలు లాంటి వాటిలో కూడా పూర్తి పారదర్శకత ఉండాలి.

8. ప్రస్తుతం ఆప్ అసంతృప్తులను, రెబెల్స్‌ను ఆకట్టుకునేలా తయారైంది. పార్టీలో నాయకులు చేసే వ్యాఖ్యలు భిన్నంగా ఉంటున్నాయి. నేను పార్టీ నుంచి వైవిధ్యాన్ని, నమ్మకాన్ని ఆశిస్తున్నా.

9. నిజ జీవితంలో నాయకులు, ఉత్తమ ఉద్దేశ్యంతో ఉన్న ప్రజలు, అమరవీరుల సభ్యులు ఎప్పడూ గొప్ప పరిపాలన చేయలేకపోయారు. మీరు పెద్ద లక్ష్యంతో ప్రజల ముందుకు వచ్చి విజయం సాధించారు. మీరు ప్రజలకు దూరంగా ఉండలేరు.

10. స్పష్టత, సమర్థత రెండు కూడా స్వతంత్రంగా ఉంటాయి. నమ్మకమైన పరిపాలన అంటే సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు. ఇంకా చాలా ఉంది.

సర్, దేశం మార్పు కోరుకుంటోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆప్ కనీసం 40 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. మీరు విధానాన్ని నిర్ణయించే స్థానంలో ఉన్నారు. మీరు నాసిరకం వ్యవస్థలో మార్పులు తీసుకువస్తారని ఆశించా. తమ నుంచి సహనం, సామర్థ్యం, నమ్మకాన్ని ఆశిస్తున్నా.

మీకు అంతా మంచే జరగాలని ఆశిస్తూ..

ఆమ్ ఆద్మీ

English summary
Dear Arvind Ji, I write this letter with a lot of hope as well as trepidation. I am hopeful because I have reason to believe that you take my views on board, and I have seen enough evidence of that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X